సర్పయాగం..;-ఎం. వి. ఉమాదేవి-నెల్లూరు
1)
అభిమన్యు కుమారుడు అతడే పరీక్షిత్తు 
వేటలో యలిసాడు విసుగుతో మునినడిగె 

శమీకుడు తపసులో సమాధానము నిడక 
 సర్పకళేబరమును సాధు మునిపై వేసె 

మునికొడుకు పాముగని ముక్కోపి శాపమిడి 
తక్షకుని విషముతో తనువువీడే రాజు 

జనమేజయుడు వినియు జనకునికై కుమిలియు 
సర్పయాగము జేయ సర్పములు నశించెను 
2)
జరత్కారు జంటకు జన్మించి నాస్థీక
తక్షకుని శత్రువుగ తనను జంపఁగ నెంచి 

జనమే జయునిజేరి చాల నెగదోసెను 
యాగమ్ము జ్వలితమై యదృశ్యమయ జాతి 

పాములవి వేగమున పడుచుండ యగ్నిలో 
మంత్రపూరిత మైన మహిమ గల యాగమది 

తక్షణము నింద్రుఁని తక్షకుడు శరణమని 
ప్రాణరక్షణ పొంది ప్రతిన మాయమయె హరి !!

కామెంట్‌లు