చిత్ర స్పందన /;-టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
 వేకువ జామున భానుని
తాకగ బోయను ఫలమని ధైర్యముతోడన్
నాకేశుడదిరిపడ తా
నాకాశములో నెగిరి దూకె ననిలాత్మజుడున్ //
నాక + ఈశుడు = నాకేశుడు - ఇంద్రుడు.


కామెంట్‌లు