స్వార్థం! అచ్యుతుని రాజ్యశ్రీ

 బుద్ధి జ్ఞానం ఉన్న మనిషి  ఎంతసేపు తనసుఖం సంతోషం స్వార్థం చూసుకుంటూ అవతలివారిని ఇబ్బంది పెడతాడు.ఆరైతు తనదగ్గిర ఉన్న ఎద్దు ముసలిదై నడవలేకపోతోందని దాన్ని ఊరికి దూరంగా వదిలేశాడు.మంచి వేగంగా పరుగులుదీసే గుర్రంనికొని జట్కా బండీతో డబ్బు బాగా సంపాదించసాగాడు.నిస్సహాయంగా ఉన్న ఎద్దు ఇలా ఆలోచించింది"నేను బతికిఉన్న న్నాళ్ళు దేవుని పిలుపు వచ్చేదాకా ఈప్రాంతంలో దొరికే గడ్డి గాదం తిని బతుకుతాను."అనుకుంటూ దైవస్మరణ చేస్తూ ఓషధీమొక్కల్ని తిని కొన్నాళ్ళకి బాగా పుంజుకుంది.ఈరైతు డబ్బు యావలో పడి గుర్రంని రోజు చాలా సార్లు తిప్పి సరిగ్గా దాణా వేసేవాడు కాదు.మాలిష్ చేయటం ప్రేమగా చూడటంలేదు.ఎంతసేపు డబ్బు పిచ్చిలో పడి గుర్రం కి విపరీతమైన అలసట వచ్చేలా జట్కా తోలేవాడు.ఓరోజు  జట్కా ఈడ్చలేక గుర్రం గోతిలో పడింది. బండి వాడికి గుర్రం కి కాళ్ళు విరిగాయి.అంతే అతని భార్య పిల్లలు సతాయించసాగారు"ముసలిది  సరిగ్గా నడవలేకపోతోందని ఎద్దుని తరిమేశావు.మీనాన్న హయాంలో  దాని తల్లి  ఆవు పాలు తాగి నీవు  ఇంత పెద్దవాడైన సంగతి మరిచావు.ఇప్పుడు నీవు మూలబడ్డావు.లాభం గూబల్లోకి దారి తీసింది అంటే ఇదే"మూగప్రాణి గోమాతలను వట్టిపోయిందని కబేళాకి తోలుతున్నాం.కానీ గోమూత్రం పేడ ఎన్నో దివ్య ఓషధీ గుణాలు కలిగింది.ముసలిఆవులు ఎద్దుల పేడతో గోబర్గ్యాస్ తయారు చేయవచ్చు. ఎరువుగా పంటలకి ఉపయోగం. ఎందుకూ పనికిరాని ప్రాణి మనిషి మాత్రమే!ముసలివారైన అవ్వతాతలను చీదరించుకోరాదు.వారి అనుభవాలతో మనం ముందుకు పోవాలి. పసిప్రాయంనించి లాలించి పెంచారు. అలాగే మన ఇంట్లో పుట్టిన పశువులు  కుక్కలనైనా వెళ్లగొట్టరాదు.స్వార్ధం అనర్ధాలకి మూలం సుమా🌹
కామెంట్‌లు