ఆరుబయట వెన్నెలమ్మ
పూదోట విరిసిన వేళా...
తారలమ్మలు తళుకుల
చీరలు పరచిన వేళా...
చప్పుళ్ళు సద్దుమణిగిన వేళా...
నిశి నిదరోయిన వేళా...
కంటిపాప పాల చుక్కలు సేవించగా...
కను రెప్పలు సయ్యాటలు విరమించగా...
ఆదమరచిన అమ్మ...
నింగి నీడలో,
కలల జాడలు చూడగా...
పైటచాటు పడతి పొత్తిళ్లలో ఒదిగిన,
పసి పాపను సైతం అల్లిన
ఆ నల్లని నాగు పడగ
నీడలను పసిగట్టేదెలా?
మైకం ముదరగా, మతి చెదరగా
మితిమీరిన మగ అహంకారాన్ని
మట్టుపెట్టేదెలా?
కల్లబొల్లి మాటల
కామాంధులను కనిపెట్టేదెలా?
పసిప్రాయాల ఉసురోసుకున్న
పశువుల పనిపట్టేదెలా?
పాల బుగ్గల, పూల మొగ్గల
పరిరక్షణ చేపట్టేదెలా?
పూదోట విరిసిన వేళా...
తారలమ్మలు తళుకుల
చీరలు పరచిన వేళా...
చప్పుళ్ళు సద్దుమణిగిన వేళా...
నిశి నిదరోయిన వేళా...
కంటిపాప పాల చుక్కలు సేవించగా...
కను రెప్పలు సయ్యాటలు విరమించగా...
ఆదమరచిన అమ్మ...
నింగి నీడలో,
కలల జాడలు చూడగా...
పైటచాటు పడతి పొత్తిళ్లలో ఒదిగిన,
పసి పాపను సైతం అల్లిన
ఆ నల్లని నాగు పడగ
నీడలను పసిగట్టేదెలా?
మైకం ముదరగా, మతి చెదరగా
మితిమీరిన మగ అహంకారాన్ని
మట్టుపెట్టేదెలా?
కల్లబొల్లి మాటల
కామాంధులను కనిపెట్టేదెలా?
పసిప్రాయాల ఉసురోసుకున్న
పశువుల పనిపట్టేదెలా?
పాల బుగ్గల, పూల మొగ్గల
పరిరక్షణ చేపట్టేదెలా?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి