సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
  ఆగ్రహం… నిగ్రహం..
     *****
 ఆగ్రహం.. నిగ్రహం.. ఈ రెండింటి వల్లే వ్యక్తికి గౌరవం పొందడమో,పరాభవానికి, నిరాదరణకు గురి కావడమో జరుగుతుంది.
ఆగ్రహం అగ్ని జ్వాల వంటిది.కొందరు తామంటే భయం భక్తి ఉండాలని అనవసరంగా ఆగ్రహంతో ఊగిపోతూ నోటికి వచ్చినట్లు మాటలు తూలుతూ ఉంటారు.
అది ఇతరులకు హాని చేయడమే కాకుండా తనకూ శత్రువై ఒంటరిని చేస్తుందని గ్రహించరు.
తామెంత చదువరులైనా ఆస్తి అంతస్తులతో తులతూగుతూ ఉన్నా...ఇటు కుటుంబంలోనూ,అటు సమాజంలోనూ  గౌరవాన్ని కోల్పోవడం జరుగుతుంది.
నిగ్రహం, సంయమనం వ్యక్తిత్వాన్ని ప్రకాశింపజేసే సహజాభరణాలు. నిగ్రహం శాంతానికి ప్రతి రూపం.
సమయాసమయాలను దృష్టిలో పెట్టుకొని నిగ్రహంతో,  సమయస్ఫూర్తితో, శాంతంగా వ్యవహరించిన వారికి గౌరవం గుర్తింపు పుష్కలంగా దొరుకుతాయి.
 అందుకే  వేమన అన్నాడు "తన కోపమే/ ఆగ్రహమే తన శత్రువు తన శాంతమే/ నిగ్రహమే తనకు రక్ష అని".
 ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు