రుక్మి.పురాణ బేతాళ కథ..- డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై

 విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించి ఉన్నబేతాళుని బంధించి భుజంపైనచేర్చుకుని నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు ' మహరాజా నీ పట్టుదలమెచ్చదగినదే నాకు రుక్మి గురించి తెలియజేయి. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు' అన్నాడు. 
' బేతాళా రుక్మి విదర్భ దేశాన్ని పరిపాలించే భీష్మకుడు అనే రాజు యొక్క పెద్ద కుమారుడు. ఇతనికి రుక్మరత, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర అనే నలుగురు సోదరులు, రుక్మిణి అనే సోదరి ఉంది.
శ్రీకృష్ణుడు, రుక్మిణి దేవి ఒకరినొకరు ఇష్టపడతారు. రుక్మి మాత్రం తన సోదరిని శిశుపాలుడు కిచ్చి చేయాలని తీర్మానిస్తాడు. ఆ వివాహానికి సుముహూర్తం కూడా పెట్టిస్తాడు. వివాహ సమయంలో అనుకున్న ప్రకారము రుక్మిణీ దేవి నగర పొలిమేరలలో ఉన్న సర్వలోకేశ్వరి ఆలయానికి వస్తుంది. అందరు చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుడు ఆమెని తన రథం మీద ఎక్కించుకొని హుటహుటిన ద్వారక వైపు బయలుదేరతాడు. రుక్మి తన సేనతో వెళ్ళి శ్రీకృష్ణుడి రథం ఎదురుగా నిలిచి దండయాత్ర చేస్తాడు. శ్రీకృష్ణుడు రుక్మి శిరస్సు ఖండించదలస్తుంటే రుక్మిణీ దేవి శ్రీకృష్ణుడి కాళ్ళపై పడి తన సోదరుడిని క్షమించి విడిచి పెట్టమంటుంది. శ్రీకృష్ణుడు శాంతించి రుక్మికి తల గొరిగించి సన్మానం చేస్తాడు.
రుక్మి తన కూతురైన శుభాంగిని ప్రద్యుమ్నునికిచ్చి వివాహము చేసెను. వివాహ సమయంలో ఇతడు బలరాముని అవమానింప దలచి జూదము నాడుటకు పిలిచెను. మూడు సార్లు అసత్యము లాడి బలరాముని కోపానికి పాత్రుడై యుద్ధంలో అతని చేత చంపబడ్డాడు 'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభగంకావడంతో, శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.పట్టువదలనివిక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.
కామెంట్‌లు