నవనార్ రాకుమారుడు రణజిత్ సింహ్ ఆనాటి క్రికెట్ ఆటగాళ్ళలో మేటి.నెవిలాకార్డస్ ఇలా రాశాడు"ఇంకో రణజిత్ ని పుట్టించటం అసాధ్యం!(ఆరోజు ల్లో).అతని బంధువు దలీప్ కూడా మంచి క్రికెట్ వీరుడు.అతను కేంబ్రిడ్జ్ లో చదివే రోజుల్లో లైట్ లేకుండా సైకిల్ తొక్కినందుకు జుర్మానా వేశారు.దాన్ని కేంబ్రిడ్జ్ పేపర్ ముద్రించింది.వెంటనే రణజిత్ అతనికి టెలిగ్రాం పంపారు. "మనభారతీయులు చెత్త పనులకి పేపర్ కి ఎక్కుతున్నారు.అలాంటి తప్పుడుపని ఎందుకు చేశావు?"అని మందలించారు. మరినేడో!బడిపిల్లలు స్కూటర్ కారు నడపటం యువత పబ్ బార్ లో గంతులేస్తుంటే చూస్తున్నాం.
ఒకసారి రణజిత్ సెంచరీ చేసి పెవిలియన్ కి రాగానే ఫ్రెండ్స్ "కంగ్రాట్స్"అన్నారు.వారికి థాంక్స్ చెప్పకుండా ఐస్ తో ఉన్న తన పాడ్ ని చూపాడు. మూడు చోట్ల గాయాలైనాయి.
1897లోఅతను ఆస్ట్రేలియా వెళ్తే అక్కడి సెనేట్ 100డాలర్ల టాక్స్ పడకుండా ఆర్డర్ పాస్ చేసింది.ఏవిదేశీయుడైనా ఆస్ట్రేలియా లో అడుగు పెట్టాలంటే టాక్స్ కట్టితీరాలి.అడ్లాయిడ్ తొలి టెస్ట్ మ్యాచ్ లో అతను 189రన్స్ చేశాడు. కానీ ఆస్ట్రేలియా క్రికెటర్ ఎర్నెస్ట్ జోన్స్ పై"నీవు తప్పుగా బాల్స్ వేస్తున్నావు" అని విరుచుకు పడ్డాడు. అందుకే అతను చేసిన స్కోర్ ని ఎవరూ పట్టించుకోలేదు.గొంతు నెప్పితో బాధపడుతున్న అతన్ని ఆస్ట్రేలియన్లు విమర్శించారు. "ఇక ఆడలేడు.అయ్యగారి పప్పులుడికినాయి"అని ఎద్దేవా గా అరవటంతో కుతకుత రోషంతో పడకపై విశ్రాంతి తీసుకుంటుకున్న రణజిత్ సరాసరి ప్లేగ్రౌండ్ కివెళ్లి ఇంగ్లాండ్ తరుఫున 195రన్స్ చేసి వారి నోరు మూయించాడు.ఆపై సరాసరి అలిసిపోయి పడకపై వాలాడు.సిడ్నీ 3వటెస్ట్ మ్యాచ్ రోజు ఉదయం గొంతు ఆపరేషన్ ఐంది.కానీ ఆతరువాత ఆడి 186రన్స్ చేసిన అతనికి జేజేలు కొట్టారు.రణ్ జీ మ్యాచ్ రణ్ జీబార్ రణ్ జీ బ్యాట్ లు మార్కెట్లో సందడి చేశాయి.భారతీయ తొలి క్రికెట్ వీరుడు రణజిత్ 20మ్యాచ్ లలో 1157రన్స్ చేసిన ఘనుడు!
వినూమన్కడ్ బొంబాయి జింఖానాలో విసిరిన బంతి ప్రేక్షకుల గ్యాలరీలోకి దూసుకెళ్లింది. ఒక 5ఏళ్ళ పిల్లాడికి తగిలి స్పృహకోల్పోయాడు ఆచిన్నారి.వెంటనే మన్కడ్ ఫీల్ఠ్ వదిలి ఆబాబు దగ్గరకు పరిగెత్తాడు. ఆసుపత్రి కి పంపాడు.ఆసాయంత్రం మ్యాచ్ పూర్తి కాగానే ఆస్పత్రికి వెళ్లి ఆబాబు యోగక్షేమాలు కనుక్కున్నాడు.
క్రికెట్ ఆటగాడు విజయ్ మర్చెంట్ కెప్టెన్ గా క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్నారు. క్రికెట్ నించి తప్పుకున్నాక ఒక విలేఖరి ఇంటర్వ్యూ చేయాలని వెళ్తే ఏమన్నాడో తెలుసా?"మీరు అనుభవాలు చెప్పమని అడుగుతున్నారు.నావాటితో ఏంలాభం?కొత్తవారిని గూర్చి రాస్తే అతనికి మీకు భవిష్యత్తు ఉంటుంది. మా పాతవారి ఆటలోని లోపాలను ఎత్తిచూపుతూ రాయండి. దాన్ని చూసి కొత్త వారు తమ ఆటకు మెరుగులు దిద్దుకుంటారు.వారికి మీకు ఉపయోగం. "ఇంత విశాలహృదయం నిస్వార్థత ఇప్పుడు ఉన్నాయా??
తనమిల్లులో పనిచేసే వారికి ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉండేవాడు. ఒక కార్మికుడు ఫోన్ చేసి "అయ్యా!నాఆరోగ్యం బాగా లేదు. నాజీతం లెక్క గట్టి ఇస్తే నా అప్పులు తీర్చుకుని ప్రశాంతంగా కన్నుమూస్తా"అనగానే విజయ్ వెంటనే లెక్కడొక్కచూసి ఆవ్యక్తికి 7వేలు పంపారు. ఆ కార్మికుడు పైసాతో సహా బాకీలు తీర్చి కన్నుమూశాడు ప్రశాంతంగా!ఇలాంటి వారు ఇప్పుడు ఉన్నారా?అసలున్నారా?ఉన్నా వారి పేరు పైకి రాకుండా అణగద్రొక్కే మాయలఫకీర్ల కాలం మనది!ఇలాంటివి చదివినప్పుడు కన్నీటి చెలమగా మారుతుంది
మనగుండె!🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి