విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించి ఉన్నబేతాళుని బంధించి భుజంపైనచేర్చుకుని నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు ' మహరాజా నీ పట్టుదలమెచ్చదగినదే నాకు రైక్వుడుడు గురించి తెలియజేయి. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు' అన్నాడు.
' బేతాళా రైక్వుడు హిందూ పురాణాలలో ప్రస్తావించబడిన ఒక మహర్షి. ఈ మహర్షి గొప్పతనాన్ని తెలిపే కథ ఒకటి చందోగ్య ఉపనిషత్తులోఉంది.
మహావృష సామ్రాజ్యాన్ని పరిపాలించే జానశ్రుతి గొప్ప పరిపాలనా దక్షుడు. ఆయన సేవాకార్యక్రమాలు జరిపించడంలోనూ, ధార్మిక కార్యక్రమాలు చేయడంలోనూ ప్రసిద్ధి గాంచాడు. తనకన్నా గొప్పవాడు ఎవరవి కొద్దిగా అహము ఉండేది. ఆయన ఒక పున్నమి రాత్రివేళ తన రాజప్రాసాద ఉపరితలం మీద అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో కొన్ని రాజహంసలు అటువైపు రావడం రాజు గమనించాడు. ఆయనకు పశుపక్ష్యాదుల భాషలు తెలుసు. కాబట్టి ఆ హంసలు తమలో తాము మాట్లాడుకోవడం వినగలిగాడు. జానశ్రుతి మహారాజు ఒక గొప్ప పరిపాలకుడు అంది ఒక హంస. దానికి మరో హంస బండి తోలుకుని జీవించే మహాజ్ఞానియైన రైక్వుడికన్నా ఈయన గొప్పవాడా? అన్నది.
ఈ సంభాషణంతా విన్న రాజు రాత్రంతా రైక్వుడి గురించే ఆలోచిస్తూ గడిపాడు. మరునాడే తాను స్వయంగా వెళ్ళి రైక్వుడిని కలుసుకున్నాడు. రాజు వినయాన్ని పరీక్షించిన రైక్వుడు ఆయనకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాడు'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభగంకావడంతో, శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.పట్టువదలనివిక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి