కృష్ణా!కృష్ణా!;- గాయత్రీ , పూణే
మందార మాలలుకట్టితి 
పొందుగ నీ సేవ చేయు పుణ్యము లేదా!
విందారగించ రావా!
సుందరగోపాలబాల! సురనుత కృష్ణా!

వేదన తీర్చెడి స్వామీ!
నీదయ చూపవ!నగధర!నిర్మల తేజా!
నాదరి చేరగ రావా!
పాదములను కొలుతు నెప్డు భక్తిగ కృష్ణా!

గోవుల గాచిన శౌరీ!
జీవన దాతవని నమ్మి చిత్తములోనిన్
భావన చేయుచు నిత్యము
పావన హృదితోడ కొలుతు ప్రణతుల కృష్ణా!//

మదిలో నీవే దొరవని
పదిలము గానమ్మి యుంటి పలుకవదేలా!
సదమల హృదయా!వినుమా!
ముదముగ నన్నేల రావ!మోహన కృష్ణా!

5. దారిని జూపెడి దాతవు 
కోరిక లేమియు నిరతము కోరను తండ్రీ!
సారెకు పిలుతును నిన్నే!
భారము నీదే యనుచును పలికితి కృష్ణా!//

కామెంట్‌లు