తాజా గజల్ ;-ఎం. వి. ఉమాదేవి
జలపాతం ప్రవాహమై పారుతుంది ఎందుకనీ 
మధుమాసం విహారమై సాగుతుంది ఎందుకనీ 

చిరుగాలీ తొలిపొద్దున అలలలాగ వీస్తున్నది 
చెలియానీ నవ్వుఅలా  తాకుతుంది ఎందుకనీ 

ప్రతిపువ్వూ సౌరభాలు పంచిమురిసి పోతున్నవి 
ప్రేమ పరిమళం నన్నే ఆనుకుంది ఎందుకనీ 

వడగాడ్పులు కొడుతున్నవి వేసవిలో అంతేగా 
నీఊర్పుల నా హృదయం కాలుతుంది ఎందుకనీ 

వలపునిషా ఇలాఉంటె మధుశాలే అనవసరం 
ఉమ తలపుల రాజహంస వాలుతుంది ఎందుకనీ !!


కామెంట్‌లు