నాన్నకు రుణానుబంధ కన్నీళ్ళు;-మాడుగుల-మురళీధరశర్మ

    నాన్నలకే
    అంకితం
*****
ఉ.మా-1
నాన్నగ తాను సంతునకు*
నందిగఁజేసిన
దేమొతెల్య;దా?
పన్నుగతానుగా
మనకు*
పాటిగవీడినదేదొ?
చెప్పలే?
డన్నియుజీవి
తాంతమున*
నార్తిగ పిల్లలకై
తపించుచున్!
పన్నుగవారి
వృధ్ధికని*
పాటుపడంగల
వారుతండ్రియే!

కం-2
తనపిల్లలబాగునకై
ననయము కోల్పోవునన్ని*
యానందములన్!
కనివినియెరుగము;వాటిని
వినిపించడు
నెవరికేని*
వివరించడుగా!

కం-3
సతిసుతహితులకు చెప్పడు
నతిదురితము
లైనగాని*
యరికష్టములున్!
మతిమంతుని
గాతనలో 
కుతకుత
నుడికించుకొనును*
గోప్యతతోడన్!

చం.మా-4
బయటికిపంచ
కుండుతను*
బాహ్యపుప్రేమలు
నమ్మరీతిగా!
పయనము
నందివెళ్ళువిధి*
పాలనయందున,
వచ్చునెప్పుడో?
వయసున
నున్నపిల్లలను*
వచ్చినవెంటనె
జూచుతండ్రిగా!
ప్రియపువిహీన
మమ్మయను*
పెక్కుచిరాకు
పరాకుమాటలున్!

చం.మా.5
అనయమువృత్తియే?యనుచు*
నారడినమ్మగపల్కు
వేళలో!
పనిగొనియింట
నుండితన?*
పాపలఁజూడు
మటన్నవాక్కులన్!
విని,కనుపిల్ల
లందరిల*
వేదనచెందును
నాన్నలేమిగా!
తనకుగతానె
వీడునను*
ధర్మమునన్న
నిజమ్ముతండ్రికిన్!

ఉ.మా-6
పెళ్ళియు,పిల్లలున్ కలుగ*
పేర్మిని నాన్నల జీవితమ్ములున్!
కళ్ళెమువేసిన
ట్లగును*
గాంచగతండ్రుల
చేయిజారుచున్!
పళ్ళెరమందు
నింపు కను*
పాపగరాత్రు
లహమ్ములందుతా!
ఛెళ్ళునచెంప
పెట్టునగు*
చేసెడుకర్మలు
చేవపంచలో!

చం.మా-7
చదువులుసంధ్యలున్ సతము*
సాకు సమస్యలు,
బంధుజాలముల్!
ఉదయమునిద్ర
లేవగను*
నుత్సవ,పండుగ
లందుమెండుగా!
సదమలమాసుపత్రులును,*
సయ్యననందున
మ్రగ్గు నాన్నగా!
పదపడినల్గి
పోవునట*
పారు సమస్యల మేనురోగముల్!

చం.మా-8
అవసరమైనచోటతను*
వంగసురక్షకుడౌనుసంతుకున్!
సవరము చేయు వేళగని*
చప్పున దాపున నిల్చు నెమ్మదిన్!
నవనవపాఠ శాలలకు*
నచ్చినచోటికి 
జేర్చు విద్యకై!
భవభయ భాధలన్నిగని*
పాపకు బాపుగ బాపునెప్పుడున్!

శార్దూలము-9
వృధ్ధాప్యమ్మనుసంతుభావనలుగా*
వృధ్ధిన్ప్రవృధ్ధింజనే!
బుధ్ధిన్పంచుననుక్షణమ్ముకరుగన్*
పొల్పొందుచున్ కాలుచున్!
శ్రధ్ధాసక్తినశించు
నాన్నతనువున్*
సల్లోపమారోగ్యముల్!
నద్దానిన్ కనకుండునెంత
జనకున్*
నాదేహమేకృంగినన్!

కం-10
వైద్యుని కలియుటతెలియదు
సద్యోగమ్మగురిపోర్టు*
సారము తేడే?
విద్యాగంధముపిల్లలు
నాద్యంతము
గొప్పవారు*
నౌననుగురితో!

కం-11
అప్పులు చేయుచు చదువును
గొప్పగ
నేర్పించబూను*
కూర్మిన తండ్రే!
యెప్పుడుసెలవులు
పెట్టుచు
తప్పకనిలబడుచు
సీటు*
తానిప్పించున్!

కం-12
పిల్లల సీటులకొరకై అల్లనతాజేరినిల్చు*
నావరుసలలో!
తొల్లిపరీక్షలువ్రాయగ
నెల్లెడరహదారినెండ*
నేనిలుచుండున్!

కం-13
పిల్లలబాగును కోరుచు
ఝల్లుగసాధించు
నేదొ*
జయమునటంచున్
చల్లునుధనమును
ధారగ
ఉల్లములులసిల్లు
నాశ*
నుత్సుకతోడన్!

కం-14
కూతురు పెళ్ళికి నాస్తుల
ప్రీతిగ నమ్ముచును
జేయు*
పెళ్ళిఘనముగా!
కాతరభావముజూపక
చేతిని సంతకములెన్నొ*
చేకూర్చునుగా!

ఉ.మా-15
అమ్మలు యేడ్తురెప్పుడును*
అందరిముందరనెన్నిమారులో!
ఇమ్మహి నాన్నలేడ్వరను*
టెవ్వరు జెప్పినసత్యదూరమే!
కమ్మినదుఃఖమేఘములు*
గాంచక నందరిముందు జాగృతిన్!
గమ్ముగనొంటరై
కనుల*
కార్చును నీటినివేడివేడిగా!

ఉ.మా-16
పిల్లలు పెద్దలై పనులు*
పేర్మినిజేసెడు వేళలందునన్!
యిల్లును గుల్లచేయుచును*
నింకగనమ్ముచు
నారి పోవగా!
తల్లియు
పిల్లలేకమయి*
తండ్రిని తిట్టి తిరస్కరించుచున్!
పల్లెరుగాయ సామ్యమున*
ప్రక్కకునెట్టుచు నీసడింతురే!

సీసం-17
యిన్నాళ్ళు వీళ్ళకై*
యిన్నిజేసితినేల?
ఎవరికైబ్రతికాను*
యిన్నినాళ్ళు!
నాకోసమై నేను*
యేకోశమందున!
దాచకుంటినిసొమ్ము*
దమ్మిడీని!
నానిజాయితికేను*
నవ్వుకొందునె లేక?
నాన్నగానేనెంచ*
నైతిననుచు!
నాకుతెలియనట్టి*
నాణ్యపాలోచన!
నాకుకలుగుచుండ*
నమ్మకుంటి!

తే.గీ.
ఉన్న రెండెకరాలను*
ఊడ్చి;నాడు!
ననుచు నమ్ముదు రందరు*
నమ్మజెప్పు!
మాటలను
విశ్వసించుచు*
పోటురాళ్ళు!
నాన్ననేడ్పించు కొడుకులు*
న్నారు నిజము!

తే.గీ-18
నాన్నగుండెలపైతన్ను*
నంగ నాచి!
నపుడుఏడ్వగా కన్నీళ్ళు*
నావిరవగ!
నీళ్ళు, కన్నీళ్ళు బీళ్ళగు*
నీరు గార్చ!
సత్యమిద్దియే
తండ్రులు* 
సాక్షి కనుడి!

చం.మా-19
కొడుకులుమంచి
వారగుచు*
కొండలనెక్కు
ప్రయోజకుండవన్!
యిడుములు
కల్గుతండ్రులకు*
నీప్సితభాధ్యత
భాధలెక్కువౌ!
తడబడకుండ యేడుపను* 
దాహము పెంచుట
తప్పదేరికిన్!
కొడుకులు
పిల్లలన్ కనగ*
కోరినమిత్రులు
గుర్తునుందురే?

కం-21
పిల్లల పుట్టిన రోజున
తల్లులు తమ
పిల్ల,స్నేహ*
తతులనుపిల్చున్!
కొల్లలునాన్నకు
మిత్రులు
నెల్లరుమీరెవరినెరుగ*
లేరిదినిజమున్!

సీసం-22
నాన్నపుట్టినరోజు*
నెన్నగాతెలియదు!
ఏమిచెప్పవలయు*
నేల నేను?
మీపిల్లలే మీకు*
మీభవితవ్యమౌ!
ననుచుభావింతురు*
ననవరతము!
నాన్నమీభవితవ్య*
మన్నభావనరాదు!
నాన్నకుమీరెగా*
నాడు నేడు!
మీకోసమైతాను*
మేలుజేయగనెంచి!
ధైర్యము సరిపోక*
తప్పుజేసె!

తే.గీ
మీదుమూలము
గాతాను*
మిన్నకుండి!
శక్తి కోల్పోయి దివ్వెగా*
చావలేక!
బతికి చచ్చిన జీవులై*
భాధ పడుచు!
కలిని సామాన్య
జీవన*
గాములైరి!

   నీతి
తే.గీ-23
తనయులందరు
నొకనాడు*
తండ్రి కొడుకె!
కొడుకులే తండ్రు
లౌ నేడు*
కూర్మిలోన!
రుణము
ననుబంధసంబంధ*
రూఢిగాని!
జీవకారుణ్య
విలువల*
సేవ సుఖము!

ఉ.మా-24
తండ్రిగ చిన్ననాడుకడు*
ధైర్యము నింపుచు నెత్తినెత్తుచున్!
ఓండ్రనుపెట్టుచున్న
తను*
వోపిక జూపుచు బుజ్జగించెగా!
గండ్రడ గండడైనసరి*
గౌరమిచ్చుచు సేవజేయుడీ!
తండ్రియు,తల్లి,
భూమియును*
దైవము,నాకము
కన్న మిన్నగా!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


కామెంట్‌లు