" అందాల బాలలు-- మందార మాలలు";----గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
అందమైన పిల్లలు
చందమామ రూపులు
అందరాని తారలు
అందరికీ ఇష్టులు

మందహాస సొగసులు
అందెల సుసవ్వడులు
చిందులేయు లేగలు
విందుచేయు బాలలు

మందార మాలికలు
కుందనపు శిల్పాలు
ఇంధనమే బాలలు
చందన పరిమళాలు

పందిరిలా అందము
అందరితో బంధము
హుందాతన చిహ్నము
కందర్ప స్వరూపము


కామెంట్‌లు