నిత్యదానము (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
నిత్యదానము జేయుమన్నా! 
నీతినియమము గలుగురన్నా!!

నిత్యదానము జేయుమన్నా! 
కష్టనష్టములు తొలగురన్నా!!

నిత్యదానము చేయుమన్నా!
సత్యాహింసలు దొరుకురన్నా!!

నిత్యదానము జేయుమన్నా! 
నిఖిల జీవము గలుగురన్నా!!

నిత్యదానము జేయుమన్నా! 
నరకవాసము దప్పురన్నా!!

నిత్యదానము జేయుమన్నా!
నిత్యముగ వైకుంఠవాసమేరన్నా!!


కామెంట్‌లు