అన్నీఉన్నా ..!!---డా.కె.ఎల్.వి.ప్రసాద్.--హన్మకొండ .


 కనులుండి 
చదవలేను ..
కంటికి ...
క్యాటరాక్టు 
తయారయింది !
కారుండి 
నడపలేను ...
కాలనీలో ...
కాలువల 
(మురికి )
రిపేరు ....
మొదలయింది !
కాళ్ళుండి 
నడవలేను 
వయసుతో 
భరించలేని 
మోకాళ్లనొప్పులు !
పళ్ళుండి ....
మామిళ్ళు -
తినలేను ...నన్ను 
నిత్యం-
వెన్నంటి ఉండే 
మధుమేహం ...!
అందుకే ---
ఆనందమయ 
జీవితానికి,
కేవలం డబ్బుంటే -
సరిపోదు ....
కాలం --
కలిసిరావాలి ....!
ఆరోగ్యం -
సహకరించాలి ..!!
             ***
కామెంట్‌లు