మా అవ్వంటే మాకిష్టం;-  సత్యవాణి
మా అవ్వంటే మాకిష్టం
మాతాతంటే మహఇష్టం
అవ్వాతాతలు చెప్పే మాటలు
భలే భలే ఇష్టం

తాతయ్య కథలు మాకిష్టం
అవ్వ  నీతులూ మహఇష్టం
అవ్వా తాతల కథలూ నీతులు
భలే భలేఇష్టం

తాత ఆటలు మాకిష్టం
అవ్వ పాటలు మహఇష్టం
అవ్వాతాతల మంచి సూక్తులు
అంత కంటె ఇష్టం

అవ్వతొ పడకా నాకిష్టం
తాతతొ నడకా మహ ఇష్టం
అవ్వా తాతల ఆత్మీయతలు
అవి ఎంతెంతో  ఇష్టం

              

కామెంట్‌లు