శంకర భగవత్పాదులజయంతిశుభాకాంక్షలు అందిస్తూ======================జ్ఞానభాస్కరులు,లోకశుభకరులు!అద్వైతాదిపురుషులు ,వాదనాచతురులు!చిరుప్రాయంలోనే,గురురచనాసమర్థులు!మానవజాతికి తరణోపాయ,దిశానిర్దేశకులు!ఇలపై అవతరించిన,ఆ శంకరులే!మన ఆదిశంకరులు,ప్రాతస్మరణీయులు!వారి కృపతో,వారి నిర్వాణషట్కంఆధారంగా,నేను!1.నేను కానివి--మనస్సు, బుద్ధి!అహంకారం, హృదయం!చెవి,నాలుక!ముక్కు,కన్ను!ఆకాశం, భూమి!అగ్ని, వాయువు!పంచప్రాణాలు,సప్తధాతువులు!పంచకోశములు,వాక్కు!చేయి,పాదం!మూత్రద్వారం,మలద్వారం!భోజనం,భోజ్యం!భోక్త, మంత్రం!తీర్థం,వేదం!యజ్ఞం!2.నాకు లేనివి--రాగం, ద్వేషం!లోభం, మోహం!మదం, మాత్సర్యం!ధర్మం, అర్థం!కామం, మోక్షం!పుణ్యం,పాపం!సుఖం, దుఃఖం!మృత్యుభయం,జాతిభేదం!తల్లి, తండ్రి!జన్మ, బంధువులు!మిత్రులు, గురువులు!శిష్యులు,బంధం!విముక్తి,బంధించేవారు!నేను--చిదానంద రూపుడైనశివుడ్ని!_________
జ్ఞానభాస్కరులు;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి