ఆట వెలదులు
============
కాకతీయ రాణి కలికి రుద్రమదేవి
పురుషవీరతలను పొందెనిజము
రుద్రదేవునిగను రూపించె చిననాట
యుద్ధవిద్యనేర్చె యువతిగాను !
ఓరుగల్లు రాణి యోర్పుతో పా లించె
పురుషవేషమందు పుడమినేల
కుట్రదారులకును కుటిలత ద్రుంచియు
భద్రు పెండ్లియాడె భవ్య ముగను !
ఇంటిదొంగలపని నీమెపట్టియుజూసె
తరిమికొట్టెరిపుల తరుణితాను
రాజ్యరక్షణకును రాణిగన్ కృషిజేసె
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి