సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 ప్రేమించు..శ్రమించు..
     *****
ప్రేమ అనేది మనకు ఇష్టమైన వారి పట్ల చూపేదే కాదు. మనం చేసే పనిపట్ల కూడా.
అందరికీ అనుకున్న విధంగా  ఉద్యోగాలు రాక పోవచ్చు. అనుకున్న రంగంలో స్థిరపడకపోవచ్చు. ఇలా అనుకున్నవి అనుకున్నట్టు జరగక పోవచ్చు.
అలాంటప్పుడే తీవ్రమైన అసంతృప్తి కలుగుతుంది.చేస్తున్న పనుల్లో నిబద్ధత లోపిస్తుంది.
ఇలాంటప్పుడు ఓ విషయాన్ని గమనంలో పెట్టుకోవాలి..మనకు జీవన భృతిని ఇస్తూ, జీవనాధారంగా నిలిచిన పనిని ప్రేమించక పోతే నష్టపోయేది మనమే నని గ్రహించి, అందులోనే ఆనందం వెతుక్కోవాలి.
 అలా చేసే పనిని ప్రేమిస్తే ఎంత కష్టమైన పనైనా శ్రమ, కష్టం అసలు అనిపించదు.
ఆ దిశగా శ్రమించడంలో ఆనందమెలాంటిదో తెలుస్తుంది.అందులోనూ ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలూ ఉంటాయనే గ్రహింపు కలుగుతుంది..
అలా పనిని ప్రేమించడం, అందులో  శాయశక్తులా శ్రమించడం నేర్చుకుంటే మనసుకు తృప్తి, ఆనందం చేసే పనికి న్యాయం కలుగుతాయి.
 ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు