పూర్వ విద్యార్థుల సన్మానం

 శ్రీకాళహస్తి: పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు, రచయిత, మిమిక్రీ కళాకారుడు కయ్యూరు బాల సుబ్రమణ్యంకి మొదటి విధులు నిర్వహించిన కె.వి.బి.పురం మండలం
వగత్తూరు ప్రాధమిక పాఠశాలలో విద్యా
బుద్దులు నేర్చుకున్న పూర్వ విద్యార్థులు
ఇరవై సంవత్సరాల తరువాత సన్మానం
చేసారు.తామంతా ఈ రోజు ఉన్నత స్థితి
లో ఉన్నామని తమకి ప్రాధమిక దశలో
పునాదులు వేసిన ఉపాధ్యాయులను 
సన్మానించుకోవడం మరపురానిదని
పూర్వ విద్యార్థులు పేర్కున్నారు.ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ తన
దగ్గర అభ్యసించిన విద్యార్థులు ఉన్నత
స్థాయి లో ఉండటమే తమకి నిజమైన
పురస్కారమని అన్నారు.అనంతరం పూర్వ విద్యార్థుల పాత జ్ఞాపకాలను
గుర్తు తెచ్చుకుంటూ ఆయన చేసిన 
ధ్వన్యనుకరణ గ్రామస్థులందరిని అలరించింది.ఈ కార్యక్రమంలో గ్రామ
పంచాయతీ సర్పంచ్ గోపాల్,మాజీ
సర్పంచ్ సురేష్,పాఠశాల కమిటీ చైర్మన్
ఆర్ముగం ,ప్రభాకర్,సహోపాధ్యాయులు,
పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
కామెంట్‌లు