బాల కవికి సాహితీ ముత్యాలహరం పురస్కారం

 ఉట్నూరు సాహితీ తరంగిణి సెలయేర్లులో సాగే  తెలుగు నూతన లఘు కవిత ప్రక్రియల సేద్యంలో  ముత్యాలహారం ప్రక్రియాల్లో అత్యల్ప వ్యవధిలో జనబాహుళ్యంలోకి జనాదరణ పొందిన ఈ ప్రక్రియలో  పాయకరావుపేట గ్రామానికి చెందిన బాల కవి చి . ఈ .పార్థ సారధి అయ్యంగార్ గారు శతాధిక ముత్యాల హారాలు లిఖించినందుకు ఉట్నూర్ సాహితీ వేదిక అధ్యక్షులు కవన కోకిల గౌ, శ్రీ జాదవ్ బంకట్ లాల్  గారు ప్రధాన కార్యదర్శి గౌ, శ్రీ ముంజం జ్ఞానేశ్వర్ గారు, ప్రచార కార్యదర్శి ఆత్రం మోతీరామ్ గారు మరియు ఉట్నూర్ సాహితీ వేదిక ఆదిలాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ప్రక్రియ రూపకర్త సౌజన్యంతో "సాహితీ  ముత్యాలహార పురస్కారము" 2022 ని ప్రధానము చేయనైనది.
ఈ శుభ సందర్భంగా ఉట్నూర్ సాహితీ వేదికప్రచార కార్యదర్శి  ఆత్రం మోతీరామ్ గారు తెలియచేశారు. ఈ ప్రక్రియ రూపకర్త శ్రీ రథోడ్ శ్రావణ్ గారు మాట్లాడుతూ బాలకవి ఈ. పార్థసారథి గారు రెండు రోజుల్లోనే శతాధిక ముత్యాల హారాలు లిఖించి సాహితీ ముత్యాలహార పురస్కారానికి ఎంపిక అయిన బాలకవి కి ప్రత్యేక అభినందనలు తెలియచేశారు. ప్రముఖ కవి శ్రీ గద్వాల సోమన్న గారు ఈ కార్యక్రములో పాల్గొని అతితక్కువ సమయంలో శతకము చేసిన అతి పిన్న వయస్కుడు పార్థసారథికి అభినందనలు తెలియచేశారు.
కామెంట్‌లు