డైరీ(దినచర్య); లత శ్రీ

 
లత మంచంపై దిగులుగా కూర్చుంది. రాత్రంతా ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బి ఉన్నాయి. అమ్మ కాఫీ తెచ్చి చేతికిచ్చింది తాగ బుద్ధి అవ్వలేదు. పక్కనపెట్టేసింది
లత పక్కనే కూర్చున్న లతా తల్లి రాగిణి నీకు ఎందుకు రాశాడో దేవుడు. పచ్చగా పదికాలాలు నా కళ్ళముందు బతకాలని ఆశించాను. దేవుడు మనకే ఎందుకు ఇలా చేస్తాడు అంటూ బోరు మంది రాగిణి ని ఓదార్చడం లత వంతయింది.
లతకు తండ్రి లేకపోవడం వలన పదవ తరగతి పూర్తయిన వెంటనే మంచి సంబంధం అని రాగిణి పక్క ఊర్లో రైతు బలరాంతో వివాహం జరిపించింది. కరువు కాటకాలతో పంటలు పండక పోవడం వల్ల దిగులుతో బలరాం వ్యసనాల పాలయ్యాడు. ఉన్న పోలం అమ్మేసాడు.ఏమి మాట్లాడినా లతను కొడుతూ తిడుతూ హింసించేవాడు. అమ్మను బాధ పెట్టడం ఇష్టం లేక మూగగా భరించింది లత.
తాగుడికి చాల లేదన్నా నెపం తో లతా మెడలోని మంగళసూత్రం లాక్కున్నాడు. అడిగి నందులకు చితకబాది మెడపట్టి బయటకు గెంటేశాడు. స్వాభిమానం ఉన్నా లత ఏడుస్తూ పుట్టిన ఇల్లు చేరింది.
చేరదీసిన రాగిణి ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా లత మనసు కుదుట పడటం లేదు. వంట చేయడం కోసం రాగిణి లత దగ్గర నుండి లేచి వంటింట్లోకి వెళ్ళింది. పరికించి చూసిన లతకు అలమరలో తను రాసిన డైరీ కనిపించింది. తమ తెలుగు మాస్టారు డైరీ లేనిదే తరగతిలోకి అనుమతించేవారు కాదు. అప్పట్లో డైరీ రాయడం అలవాటు చేసుకుంది లత. వాటిని ముందేసుకుని చదువుతున్న లత కళ్ళముందు పాఠశాల ప్రాంగణం స్నేహితులు ఉపాధ్యాయులు చేసిన అల్లర్లు అని ఒక్కొక్కటిగా సాక్షాత్కరించాయి. మనసుకు కాస్త ఊరట కలిగించింది. చదువుతున్న లత కళ్ళు ఒక వాక్యం దగ్గర అలా నిలిచిపోయాయి. తమ సోషల్ టీచర్ చెప్పిన మాటలు ఇవి *శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది*
ఆ వాక్యాలు పదే పదే చదివింది.ఒక నిశ్చయానికి వచ్చిన దానిలా లేచి గుమ్మం వైపు వస్తున్న లతకు స్నేహితురాలు పంకజం వస్తూ కనపడింది.
కుశల ప్రశ్నలు అయ్యాక...పంకజం తో నేను మళ్ళీ చదువుకుందాం అనుకుంటున్న నువ్వేమంటావ్ పంకూ అంది..లత చదవాలన్న నీ ఆలోచన మంచిదే కాని ఊరిలో నలుగురు నాలుగు రకాలు అనుకుంటారు.తర్వాత నీ ఇష్టం అంది.అమ్మకు భారంగా తను మారకూడదు అని ఫ్యాక్టరీలో కూలి పనికి చేరింది.
అలాగే ఊరిలోని పాఠశాల కు వెళ్ళి తన ఆలోచన తెలియజేసి, సహకరించాలని కోరింది. అక్కడ సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు దూర విద్య ద్వారా విద్యను ఎలా అభ్యసించవచ్చు వివరించాడు అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశాడు.
పగలంతా ఫ్యాక్టరీలో పని చేసి రాత్రిపూట పుస్తకాలను చదివేది ఆ విధంగా ఇంటరు డిగ్రీ, ఉపాధ్యాయ విద్యను అభ్యసించింది డీఎస్సీ ద్వారా టీచర్గా ఎన్నికైంది.
ఉపాధ్యాయ వృత్తిలో చేరిన తర్వాత అమ్మను సొంత బిడ్డలా చూసుకుంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో, తన భర్త లివర్ చెడి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసింది. లత ఆస్పత్రి దగ్గరకు చేరుకుంది భర్తను అక్కున చేర్చుకుంది వైద్యానికి అయ్యే ఖర్చు భరించి తిరిగి మామూలు మనిషి అయ్యే వరకు సహనంగా సేవలు చేసింది.
భర్త తన తప్పిదం తెలుసుకున్నాడు అన్యోన్యంగా ఉన్నా ఎలా దంపతులను చూసి తల్లి మనస్సు ఎంతగానో ఊరట చెందింది. బలరాం సహకారంతో తానున్న పాఠశాలలోనే తండ్రి లేని పిల్లలను దత్తత తీసుకుని చదివిస్తూ సంతోషంగా జీవనం గడుపుతుంది.
సమాప్తం
కామెంట్‌లు