బిస్కెట్లు (బాలగేయం);-డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 బిస్కెట్లండీ బిస్కెట్లు 
కరకరలాడే బిస్కెట్లు 
రంగురంగుల బిస్కెట్లు 
రకరకాలా బిస్కెట్లు 
కోకిల రంగు బిస్కెట్లు 
గోధుమ రంగు బిస్కెట్లు 
బూడిద రంగు బిస్కెట్లు 
తీయగ ఉండే బిస్కెట్లు 
ఉప్పుగ ఉండే బిస్కెట్లు 
కొబ్బరి ఉండే బిస్కెట్లు 
బాదాం ఉండే బాస్కెట్లు 
పిస్తా ఉండే బిస్కెట్లు 
పీచు ఉండే బిస్కెట్లు
పాలు కలిసిన బిస్కెట్లు
వెన్న కలిసిన బిస్కెట్లు 
జున్ను కలిసిన బిస్కెట్లు
పన్నీరు కలిసిన బిస్కెట్లు
కరకరలాడే బిస్కెట్లు
బిస్కెట్లండీ బిస్కెట్లు !!

కామెంట్‌లు