సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు...బంధాలకు అనుబంధాలకు మెట్టినిల్లు...వేల సంవత్సరాల చరితగల సుందర ఖండం..మన భరతఖండం.....!శుచి శుభ్రతల గురించి ప్రపంచానికితెలియజేసిన భారతజాతి మనది!ఆచారాలను అనాచారాలుగాహేళన చేసిన పాశ్చ త్యాన్నిముక్కున వేలేసుకునేలా చేసినభారతావని... మనది.....!మన పురాణేతిహాసాలకునేడు పెద్దపీట వేస్తున్నయావత్ ప్రపంచం.. ...నేడు భరతజాతి అలవాట్లకుచేతులెత్తి మొక్కుతున్న వైనం....!ప్రపంచంలో ఎన్ని రకాల వైద్య విధానాలుఅభివృద్ధి చెందినా ....నేడు భారతీయ ఆయుర్వేద వైద్యంనిలిచింది కదా విశ్వ విజేతగా... !నాడు పరిహాసాలాడిన దేశాలేనేడు చెయ్యెత్తి జైకొడుతున్నభారతీయ ప్రాభవం....ఇదే ప్రపంచం మెచ్చిన భారతీయం !!***
విజయ కేతనం ..!!----శ్రీమతి లక్ష్మీపద్మజ.దుగ్గరాజు-- హైదరాబాద్,
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి