పవిత్రతకు సంకేతమై
జవసత్వాలులకు నూతన శక్తిగా
పేదింటి సంపూర్ణాహారం
ఉపమానాలలోనూ ప్రతీకగా
ఉపవాసాలలోనూ సాత్వికంగా
ఉత్తేజ పరిచే అమృతం
స్వచ్ఛమైన మనసులకు చిహ్నమై
సర్వ శుభాలకు శుభసూచికగా
మనిషి మనుగడలో
అమృత సుధ ధారలై
మనో వాక్కులో మమేకమై
అందరికీ అందుబాటులో
తీపినీ నింపిన తీయదనం
ఎన్నోదివ్య ఔషధాలును
తనలో నిక్షిప్తం చేసుకుని
పెక్కు రూపాంతరాలు చెంది
సమస్త జీవకోటికి ప్రాణ వాయువులా
ఇలలో దొరికే అమృతమే పాలు
అందుకే అందరికీ ప్రీతికరం
శైశవం నుంచి వృద్ధాప్యం
వరకు పాలే ఆరోగ్యానికి
ఎంతో మేలు
ఒక్క గ్లాస్ తాగితే చాలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి