వేసవికాలం;-పెందోట వెంకటేశ్వర్లు-సిద్దిపేట
వేసవి కాలం వచ్చింది
బడికి సెలవులు తెచ్చింది
మండే ఎండలు ఒక వైపు
ఆటల సంబర మొక వైపు

సమ్మర్ క్యాంపులు వచ్చాయి
ఉఛిత శిక్షణ లు తెచ్చాయి
సైకిల్ ఎక్కి తిరిగెదము
పార్కులలో ఆడెదము

పుస్తకాలు చదివెదము
ఆటలు ఎన్నో ఆడెదము
కొత్త ఆటలు నేర్చెదము
హాయిగ సెలవులు గడిపెదము.


కామెంట్‌లు