పదాలెరుగని పెదాలకుమర్మమెరుగని మనసుకుమాటలు నేర్పేది అమ్మమధువుపంచే మాయమ్మఒళ్ళు పులకరించగాఒడినే బడిగా చేస్తూఓనమాలు నేర్పేది అమ్మఓషధులు పోసే మాయమ్మముద్దుముద్దు మాటలతోముచ్చటైన మాటలతోమురిపాలు పంచేదమ్మముందుకునడుపు మాయమ్మఅలసిన హృదయాలకుఅమితమైన ప్రేమతోఆహ్లాదం పంచేదమ్మఆనందం నింపేమాయమ్మఆకలేసిన వేళలోఅలకబూనిన వేళలోబువ్వ పెట్టేది అమ్మబుజ్జగించేది మాయమ్మఆపదలో ఆప్తుడిగాకష్టాల్లో మిత్రుడిగావెంట ఉండేది అమ్మవెలుగుపంచేది మాయమ్మముల్లుగుచ్చుకున్నాముప్పు వాటిల్లినాతల్లడిల్లేది అమ్మతబ్బిబ్బయ్యేది మాయమ్మఅంతులేని అనురాగానికినిండైన మమకారానికినిలువెత్తు నిదర్శనమమ్మనిజాయితీగల మాయమ్మకల్మషం లేని ప్రేమకునిర్మలమైన మనసుకునిజ రూపము అమ్మకనిపించే దైవం మాయమ్మజీవితంలో తోడుంటూబతుకుపోరులో గెలిపిస్తూభవితకు బాటవేసేదమ్మసృష్టికి మూలం మాయమ్మ======================మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో======================
అనురాగమయి అమ్మ (గేయ కవిత); -- ఈర్ల సమ్మయ్య టీచర్MPPS శ్రీరాంపూర్ ఎస్సీ కాలనీపెద్దపల్లి జిల్లా, తెలంగాణ Cell: 9989733035
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి