*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౮౨ - 082)*
 *దైవ పద్ధతి*
కందం:
*కందుకమువోలె సుజనుఁడు*
*గ్రిందం బడి మగుడ మీఁదికి న్నెగయుఁజుమీ,*
*మందుఁడు మృత్పిండమువలెఁ*
*గ్రిందం బడి యడఁగి యుండుఁగృపణత్వమునన్.*
*తా:*
మంచివారు, బంతి లాగా, కింద పడినా కూడా పైకి లేచి ఎదుగుతారు. మంద బుద్ధి, బంక మట్టి ముద్ద లాగా కింద పడితే కందే వుండి పోతాడు......... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*నలుగురికీ మంచి జరగాలి. నా చుట్టూ వున్న నలుగురూ చక్కగా ఎదగాలి అని పదిమంది మంచినీ కోరుకునే వారు, ఏదైనా సందర్భంలో కర్మ వశాన తగ్గి వుండవలసి వచ్చినా, పరమాత్ముని చేదోడు తో తిరిగి తన స్థానాన్ని తాను పొందుతాడు. అంతే కానీ, ఏటికి ఎల్లకాలమూ, మంచివారికి, తగ్గి వుండ వలసిన పరిస్థితులు వుండవు. అంతటి సహాయకారి అయిన ఆ పరేమశ్వరుడు మనందరికీ మంచి వారు గా జీవించే జీవితం అనుగ్రహించాలని ప్రార్థిస్తూ....... .*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు