"నీ జ్జాపకం నాతోనే"1980(ధారావాహిక 43,వ బాగం)"నాగమణి రావులపాటి "
 కృషి వుంటే మనుషులు రుషులవుతారో లేదో 
తెలియదు కానీ పట్టుదల వుంటే ఏదయినా
సాధించ వచ్చని కుసుమ నిరూపించింది.....!!
కలిసి వచ్చే కాలం వస్తే నడిసముద్రంలో కూడా
నావ దోరికీనట్టు అయిందని సంబర పడుతున్న
సమయంలో ఒక పీడకల తననే గమనిస్తున్నదని
తెలుసుకోలేక పోయింది కుసుమ
టైలరింగ్ మెటీరియల్ హోల్ సేల్ గా తీసుకు
రావటం కుసుమకు  అలవాటు ఆ క్రమంలో 
స్కూటీపై మిట్ట మధ్యాహ్నం బయలు దేరింది...
నిరంతరం తన కదలికలను గమనించే  కళ్ళు
వెనుకే ఫాలో కావటం గమనించలేక పోయింది.....
ఆ హోల్సేల్ షాపు ఊరికి చివరి వుండటాన
మద్యలో  కాళీ ప్రదేశం ఉంది మధ్యాహ్నం
కావటాన నిర్మానుష్యంగా వుంది వెనుకే వచ్చే
దుష్టుడికి అవకాశంగా దొరికింది దాన్ని
సద్వినియోగం చేసుకోదలిచాడు అతని పేరు
శివ చూడటానికి బాగానే వుంటాడు.......!!
చదువు పెద్దగా అబ్బలేదు కుసుమ షాపుకు
కొంచెం దూరంగా వెల్డింగ్ షాపు  అతని దగ్గరే
షాపుకు కావలసిన పరికరాలు చేయించింది...
అప్పటి నుంచి వాడి కన్ను కుసుమపై  పడింది
ఆమెనే చూస్తూ చూస్తూ వాడి బుద్ది వక్రమార్గం
పట్టింది .........!!
ఈ రోజు కుసుమ ను ఫాలో అవుతుంటే దారిలో
వాడి ఇద్దరు ఫ్రెండ్స్ కలిసారు వాళ్ళను చూడగానే
వాడి పుర్రెలో ఇంకా ఘోరమైన ఆలోచనలు
తలెత్తాయి అంతే వ్యూహ రచన చేసారు.....!!
అంతే వాళ్ళు మనసులో కుసుమ పై కాంక్ష పెరిగి
ఆమెను ముగ్గురూ అడ్డగించి పక్కనే వున్న
పొదల్లోకి తీసుకు వెళ్ళి తనివి తీరా ఆమె అందాన్ని
ఆరగిద్దాం అనుకున్నారు...అనుకున్నదే తడవుగా
శరవేగంతో మోటర్ సైకిళ్ళను ముందుకు పోనిచ్చి
కుసుమ స్కూటీకి అడ్డుగా నిలబెట్టారు .......!!
ఈ హటాత్పరిణామానికి కుసుమ విస్తు పోయింది... 
ఏయ్ శివా ఏమిటీ అడ్డుగా నిలిచారు వాళ్ళెవరూ
అని కంగారుగా అడిగింది ...ఏమిటే నీకు చెప్పేది
అని శివ ఆమెను స్కూటీ పైనుంచి కిందకి లాగాడు....
ఒకడు  కుసుమ చేయి లాగి భుజాలపై మోసే
ప్రయత్నం చేసాడు ...ఇంతలో ఒక విచిత్రం జరిగింది..
అదే టైమ్ లో రాహుల్ బండిపై అటు నుండి వస్తూ వాళ్ళకు కనిపించాడు....పక్క ఊరిలో బ్యాంక్
పనిమీద వెళ్ళి వస్తున్నాడు.....
 శివా ఫ్రెండ్ రాహుల్ ను చూసి కుసుమ ను వదిలి ఒరేయ్ దీని సంగతి తరువాత చూద్దాం ముందు
ఇక్కడినుండి పోదాం పదండి అని తొందర 
చేయటంతో అక్కడి నుండి ఉడాయించారు....
రాహుల్ దూరం నుండి ఊహించాడు ఎవరో
అమ్మాయిని అపహరిస్తున్నారని వేగం పెంచి
త్వరితంగా అక్కడికి చేరుకున్నాడు రాహుల్.....
వాళ్ళ తోపులాటలో కిందపడిన కుసుమ  నెమ్మదిగా
లేవటానికి ప్రయత్నిస్తొంది  ఎక్స్యూజ్ మీ అని
చేయి అందించాడు అతని చేయి పట్టుకుని పైకి
లేచిన కుసుమ రాహుల్ ను రాహుల్ కుసుమ ను
ఓకే సారి చూసుకున్నారు అంతే రాహుల్ ను
చూసిన కుసుమ కట్టలు తెగిన దుక్కంతో
రాహుల్ ను హత్తుకు పోయింది (సశేషం)

కామెంట్‌లు