"నీ జ్ఞాపకం నాతోనే"1980(ధారావాహిక 44,వ బాగం)--"నాగమణి రావులపాటి "
 ఆ హటాత్మరిణామానికి  రాహుల్ కంగు  తిన్నాడు కుసుమ అన్నీ మరిచిపోయి ఆపద సమయంలో
ఆపద్బాంధవుడిలా రాహుల్ ల్ చూసి ఉద్వేగంతో
లతలా అల్లుకుంది ......‌......!!
ఎవరో ఆడపిల్ల ఆపదలో వుంది చేయి అందించి
 దైర్యం చేపుదామనుకుంటే ...ఆ ఆపద తన
ప్రాణానికి ప్రాణమైన ప్రియురాలికని తేలియగానే
రాహుల్ హృదయం కుత కుతలాడింది........!!
ఆవేశం అనురాగం కలగలిసి  నీవు నా ప్రాణం 
నీకు నేనున్నాను అనే భరోసాగా భయ రహిత
విహిత ను చేసి ప్రేమతో తల నిమిరాడు రాహుల్...‌!!
తేరుకున్న కుసుమ ఆశ్చర్యంతో!! తల్లడిల్లే
  హృదయంతో రాహుల్  ఒకరిని ఒకరు
చూసుకున్నారు ...............!!
రాహుల్ మీరు  ఇక్కడ?? సమయానికి మీరు
రాకపోతే ఈసరికి  అని కుసుమ నోటివెంట
వెలువడే మాటలను తన అరచేతితో మూస్తూ
ఇప్పుడు ఇవన్నీ అప్రస్తుతం నీవు క్షేమం కదా
నువ్వు నా ప్రాణానివి నీకేమీ కాదు కుసుమా....!!
ఆ స్కూటీ అక్కడ వదిలేయ్ నీ షాపుకు చేర్పిస్తాను 
రా నా బండి మీద కూర్చో షాపు దగ్గర దింపుతారు 
అని రాహుల్ అనగానే మీకెలా తెలుసు నాషాపు
అని అడిగిఃది కుసుమ.......!!
నాకు అన్నీ తెలుసు తరువాత తీరికగా 
మాట్లాడు కుందాం అని రాహుల్ అనేసరికి
మారు మాట్లాడకుండా రాహువు అనుసరించింది
కుసుమ(సశేషం).......... .!!

కామెంట్‌లు