"నీ జ్జాపకం నాతోనే"1980 (ధారావాహిక, 47,వ బాగం), "నాగమణి రావులపాటి"
కుసుమ సమయస్ఫూర్తితో అటు తమ్ముడిని చదువులోజిరాక్క్ ప్రింటింగ్ పనుల్లో బాగా
ప్రిపేర్ చేయిస్తోంది చెల్లికి చదువుతో పాటు 
టైలరింగ్ లో గణ్యత సాధించటం కోసం ఫేషన్
డిజైనింగ్ కోర్సులో జాయిన్ చేయించింది

మద్యలోతనూ వర్క్ చేస్తూ తన కాఫీ పొడి బిజినెస్ 
సమర్థవంతంగా క్షణకాలం వృధా కానీయక
బిజీ లైఫ్ తో దూసుకు పోతోంది ..........!!

కుసుమ బాబాయి ఫ్రెండ్ సహకారంతో వైజాగ్ 
దగ్గర కాఫి గింజలు అంటే అరకులో గిరిజనులు
కాఫీ సాగు చేయిస్తుంటారు .....వాటి మార్కెటింగ్
గిరిజన కోపరేటివ్ మార్కెటింగ్ సంస్థ చేస్తుంది.....

కనుక శ్రేష్టమైన అరకు కాఫీ గింజలు గిరిజన సహకార
మార్కెటింగ్ సంఘం నుండి తెప్పించి పరి శుబ్రంగా పౌడర్ పట్టి అమ్మకం ప్రారంభించింది కుసుమ
నాణ్యమైన కాఫీ పౌడర్ సరసమైన ధరకు
అందిస్తుండటంతో కొద్ది రోజుల్లోనే స్తానికంగా
 బాగా ప్రాచుర్యం పొందింది .....‌.‌........!!

అమ్మకాలు పెరిగాయి ఇంకొక వర్కర్ని పెట్టింది
కృషితో నాస్తి దుర్భిక్షం అనేరీతిన మంచి లాభాలు
రావటంతో ఉత్పత్తి పెంచాల్సి వచ్చినా చిన్నషాపు
సరిపోక పోయింది .....

అప్పుడు కుసుమ బాబాయి గారిని సలహా
అడిగింది ఆయన మిత్రుడు ఒకాయన కుసుమ
మంచితనం నిజాయితీగా వ్యాపారం చేస్తూ...
కష్టపడటం చూసి అభిమానంగా కుసుమతో
నీకు అభ్యంతరం లేకపోతే మాకు ధాన్యం
గోడౌన్ వున్నది మా అబ్బాయి చూసుకునేవాడు
వాడికి విదేశంలో జాబ్ రావటంతో మద్యలో
వదిలేసి వెళ్ళాడు ..........

నేను చూసుకోలేక  వదిలేసాను కాళీగా పడి వుంది
అది శుభ్రం చేసుకుని నీ కాఫీ పొడి తయారీ కేంద్రానికి 
ఉపయేగించుకో తల్లీ నాకు అధిక అద్దె వద్దు నామ
మాత్రంగా ఇవ్వు నాకూతురు లాంటి దానవు
అని అన్నాడు ఆ పెద్దమనిషి ......

అంతే ఎగిరి గంతేసినట్టు ఆనందంతో ఎంతమాట
బాబాయి గారు అది నా అదృష్టంగా భావిస్తాను
రేపే శుభ్రం చేయిస్తాను అని ఆనందంలో
తేలిపోయింది కుసుమ.(సశేషం).........!!

కామెంట్‌లు