"నీ జ్జాపకం నాతోనే"1980(ధారావాహిక 57,వ,బాగం) "నాగమణి రావులపాటి "
 భోజనాలు ముగించుకుని గీతా కుసుమా పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు ఇంతలో వేణు వచ్చాడు తనుకూడా భోజనం ముగించు కున్నాక కుసుమా గీతలు వద్దకు వచ్చాడు......!!
 వేణూతో గీత అన్నది కుసుమ నీతో మాట్లాడాలని
అంటోందిరా అని సరే నేనేమన్నా కాదంటానా
పరాయి వాడినా చెప్పు కుసుమా ఏమి అడగాలి
అనుకున్నావో మనలో మనకు మొహమాటం 
ఎందుకు అని అన్నాడు కుసుమ తో వేణు..‌‌....!!
ఏమీ లేదురా మా చెల్లెలు పూర్ణిమ వుందిగా అని
అనగానే ఔను సన్నగా రివటలా వుండేది అయితే
అని మాట మద్యలో అన్నాడు వేణు నన్ను 
చెప్పనిస్తావా లేదా అని కుసుమ  అన్నది ఇప్పుడు
 రివట కాదు బాగానే వుంది అని అన్నది కుసుమ..!!
సరేలే అయితే అని నవ్వుతూ అడిగాడు దాన్ని
నీకు ఇచ్చి పెళ్ళి చేయాలని నేనూ గీతా అనుకున్నాం
ఆంటి అంకుల్ వాళ్ళకి సమ్మతమే కానీ నీవు
ముఖ్యంకదా నీ అభిప్రాయం తెలుసుకోకుంటాం
మేమేలానిర్ణయం తీసుకుంటాం...గీత ద్వారా
విషయాలన్నీనీకు తెలుసు... చెప్పరా ఏమంటావు
అని అడిగింది కుసుమ ...‌...‌.......!!
కుసుమా ఈ ముసుగులో గుద్దులాట వద్దు
గీత ద్వారా మీ గురించి తెలుసుకుని  మేమంతా 
పూర్ణిమను నేను చేసుకుంటే బాగుంటుందని అందరం అనుకున్నాం కానీ నీ అభిప్రాయం ఏంటో
తెలియదుగా అందుకే గీతా బావా వచ్చారు నీకు
ఓకే కదా నేను చెపుతున్నాను విను......!!
పూర్ణిమను చేసుకోటానికి నాకు ఎటువంటి
అభ్యంతరం లేదు మా ఇంటిల్లిపాదికీ ఇష్టమే
పూర్ణిమ ఎలా వున్నా నీ చెల్లెలు నీ పెంపకం
మాకు తెలుసు నీకో విషయం తెలుసా గీత
చెప్పగానే నేనే వద్దామనుకున్నా గీతనే చెడ
గొట్టింది  అని నవ్వుతూ అన్నాడు వేణు......!
ఔను నీవుఅలాంటి వాడివే అని కుసుమ అనగానే
చాల్లెండి మీ జోకులు కుసుమా తీరిందా నీ అనుమానం వేణూతో సహా అందరికీ ఇష్టమే
ఇంకా మోగిద్దాం పెళ్ళి బాజాలు అని  అన్నది గీత
కుసుమ కళ్ళవెంట ఆనందం బాష్పాలు వర్షించగా
అబ్బా మొదలయ్యాయా నీకు ఆనందం వచ్చినా
బాధ కలిగినా కష్టమే  అన్నాడువేణు......!!
కుసుమ.. గీత వాళ్ళు అమ్మా నాన్నలతో ఒక మంచిరోజు చూసి వేణుని తీసుకుని రండి నేను
వెళ్ళి వస్తాను ...అని అనగానే రాజీవ్ తన కారులో
కుసుమ ను రాహుల్ ను దింపి రమ్మని డ్రైవర్ ను
పురమాఇద్దాం అని అనుకున్నాడు 
కానీ రాహుల్ తన కారులొ కుసుమ తీసుకుని
 వెళతాను నేనే డ్రైవ్ చేస్తాను అని అనగానే ఓహో
ముందే అనుకున్నారా అని గీత నవ్వుతూ అనగానే
నాకు తెలియదే రాహుల్ తనకారు అక్కడికి 
తీసుకు వస్తాడని అనగానే ఏం కాదులేవే సరదా అన్నాను తన కారుని తీసుకెళ్దాం అనుకుని వుంటాడులే అని అన్నది గీత...........!!
ఇంతలో రాహుల్ కారుతో వచ్చి డోర్ తీసి వెల్కమ్
మేడం రండి మన కారులో వెళ్దాం అని అన్నాడు...
చాలా సిగ్గు బిడియాల మద్య ముందు సీటులో రాహుల్ పక్కన కూర్చుంది కుసుమ గీత రాజీవ్
లకు బై బై చెప్పి కారు స్టార్ట్ చేసాడు రాహుల్...
అనురాగాల పులకింతలతో ప్రేమ పరవశం పరవళ్ళు తొక్కగా(సశేషం)...........!!

కామెంట్‌లు