1.
అన్యాయం కలిగింది
ఆక్రోశం రగిలింది
ఉప్పెనగా మారిపోయి
ఉవ్వెత్తున ఎగిసింది.
2.
తెలంగాణ పోరాటం
దశాబ్దాల ఆరాటం
నిజాయితీగ సాగింది
బానిసత్వ చెలగాటం
3.
సలసలా కాగుతున్నది
ఒంట్లోనీ రుధిరమ్మిది
చీకట్లను చిదిమేయుటకు
తెలంగాణ తేరుకుంది
4.
నిజాం దాష్టికాలకు
పిశాచీ పాలనకు
తెలంగాణ చైతన్యం
తెరలేపే సమరాలకు
5.
దశాబ్దాల దోపిడీలు
సాగవు మీ ఆగడాలు
అంతమొందె వరకంటు
సాగించిరి సమరాలు
6.
విద్యార్థులు,యువకులు
ఊరువాడ జనాలు
ఉద్యమమై కదిలింది
అమరమే త్యాగాలు
7.
లాఠీల గిరాటులను
ఉక్కువలె సంకెళ్ళను
నెత్తుటి ప్రవాహాలలో
అవతరించి నిలిచేను
8.
మరువలేని త్యాగాలు
సమరంలో ప్రాణాలు
సకల జనుల సమ్మెలతో
స్వేచ్ఛతో సంబరాలు
9.
రాక్షస పాలన అంతం
పోరుబాట పంతం
ప్రజా ఉద్యమమె గొప్ప
చరితలోగల ఉదంతం
10.
తరతరాల స్వప్నమిది
తెలగాణ గుండె ఘోసిది
విషం చిమ్మిన వానిపై
శరం వదిలే శౌర్యమిది
అన్యాయం కలిగింది
ఆక్రోశం రగిలింది
ఉప్పెనగా మారిపోయి
ఉవ్వెత్తున ఎగిసింది.
2.
తెలంగాణ పోరాటం
దశాబ్దాల ఆరాటం
నిజాయితీగ సాగింది
బానిసత్వ చెలగాటం
3.
సలసలా కాగుతున్నది
ఒంట్లోనీ రుధిరమ్మిది
చీకట్లను చిదిమేయుటకు
తెలంగాణ తేరుకుంది
4.
నిజాం దాష్టికాలకు
పిశాచీ పాలనకు
తెలంగాణ చైతన్యం
తెరలేపే సమరాలకు
5.
దశాబ్దాల దోపిడీలు
సాగవు మీ ఆగడాలు
అంతమొందె వరకంటు
సాగించిరి సమరాలు
6.
విద్యార్థులు,యువకులు
ఊరువాడ జనాలు
ఉద్యమమై కదిలింది
అమరమే త్యాగాలు
7.
లాఠీల గిరాటులను
ఉక్కువలె సంకెళ్ళను
నెత్తుటి ప్రవాహాలలో
అవతరించి నిలిచేను
8.
మరువలేని త్యాగాలు
సమరంలో ప్రాణాలు
సకల జనుల సమ్మెలతో
స్వేచ్ఛతో సంబరాలు
9.
రాక్షస పాలన అంతం
పోరుబాట పంతం
ప్రజా ఉద్యమమె గొప్ప
చరితలోగల ఉదంతం
10.
తరతరాల స్వప్నమిది
తెలగాణ గుండె ఘోసిది
విషం చిమ్మిన వానిపై
శరం వదిలే శౌర్యమిది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి