*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము - (౮౯ - 89)*
 *బ్రహ్మ విష్ణువు లకు సదాశివుని యొక్క శబ్దమయ శరీర దర్శనభాగ్యము కలుగుట*
*ఈ విధముగా భగవతి సహితంగా ప్రకటమైన సదాశివుని శబ్దరూపమను చూచిన బ్రహ్మ, విష్ణువు లు కృతార్ధులము అయ్యాము అనుకున్నారు. శరీరధారిగా వచ్చిన శివునకు వీరిద్దరూ నమస్కరించి, స్తోత్రం చేశారు. పైకి చూసారు. అప్పుడు వారికి పరమశివుడు అయిదు కళలతో ఓంకార జనిత మైన మంత్రముగా కనిపించాడు. "ఓం తత్వమసి" అనే గొప్ప వాక్యము వారికి కనిపించింది. అది ఉత్తమమైనది, శుద్ధస్ఫటికము వంటిది. సకల ధర్మములను, సర్వ అర్ధమల సాధనలో ఉపయోగపడుతుంది. "ఓం తత్వమసి" తరువాత "గాయత్రి" అనే మహా మంత్రము కనిపించింది. ఇందులో 24 అక్షరములు ఉన్నాయి. ఈ గాయత్రి, చతుర్విధ పురుషార్ధ ఫలమును ఇస్తుంది. "ఓం తత్వమసి", " గాయత్రి " తరువాత "మహా మృత్యుంజయము", "పంచాక్షర మంత్రము", దక్షిణామూర్తి అని చెప్పబడే "చింతామణి మంత్రము", వరుసగా వచ్చాయి. ఈ అయిదు మంత్రములను విష్ణువు వరుసగా జపము చేయసాగాడు.*
*రుక్, యజు, స్సామ వేదములు ఈ సదాశివుని రూపములు. ఇతడు ఈశులకే ఈశుడు అయి, "ఈశానుడు" అయ్యాడు. ఈయన సౌమ్యమైన హృదయము గలిగి "అఘోరము" అయ్యాడు. చరణములు మన మనస్సులను రంజింపచేసే ఆనంద చరణాలు. ఈయన సర్వోత్క్రుష్టుడు. ఎంతో గొప్పదైన నాగరాజును ఆభరణముగా వున్నవాడు. అన్నివైపులా పాదములు, కళ్ళు వున్న వాడు. బ్రహ్మ కు, విష్ణువు కు అధిపతి. కళ్యాణప్రదుడు. సృష్టి, స్థితి, సంహారములను చేయు వాడు. ఇటువంటి సాంబశివుని, బ్రహ్మ విష్ణు దేవులు అనేకమైన ప్రియ వచనము లతో ఆరాధించారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు