ఆటలే కదా
బాల్యాన్ని బలంగా
తీర్చిదిద్దేవి
ఆటల్లో ఆనందమే
అది నిత్యచైతన్యమే
మనసుకు ఉల్లాసమే
అలసిపోని ఉత్సాహమే
గెలుపు బాటచూపేవి
నైపుణ్యన్నంతో వెలికితీసేవి
లక్ష్యఛేదనకై పరుగుపెట్టేవి
ఆటలే ఆటలే ఆటలే
పరుగులో పడిపోయిన
పందెంలో ఓడిపోయిన
ప్రయత్నాన్నే హృదిని నింపేవి
ఆటలే ఆటలే ఆటలే
ఎన్నాటలాడినా
అలుపన్నదే ఎరుగనిది
బాల్యమే ముమ్మాటికీ బాల్యమే
ఆరునూరైనా
నూరు నూటపదహారైనా
హుషారే దాని సొంతం
బాల్యానికి ఆసాంతం ఆటలే
వ్యాయామమిచ్చి పెరుగుదలనిచ్చేవి
తిన్నదేదైనా సరే
అరుగుదలనిచ్చేవి
ఆటలే ఆటలే ఆటలే
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి