అరాచకాలు;-మమత ఐలకరీంనగర్9247593432
 క.
దేవుని ప్రక్కకు ద్రోయుచు
జీవుల స్వార్థంబు పెరిగి శృతి మించంగన్
గోవులవలె యెట్లుందురు
గోవర్ధన! విలువలన్ని కుంపటి కెక్కెన్
క.
బడిలో నే‌ర్చిన విలువలు
సుడిగుండంలోన జిక్కి సొట్టలు బడుచున్
గుడిలో దైవము లేడని
మడి విడిచిన గౌరవాలు మట్టిన గలెసెన్

కామెంట్‌లు