అంతర్జాతీయ యోగా దినోత్సవం ;-మమత ఐలకరీంనగర్9247593432
 క.
యోగాసనములు వేయగ
రోగంబులు పారిపోయి రొక్కముమిగులున్
వేగిరమగు చురుకుతనము
సాగరమున పడవవో‌లె  సౌఖ్యమునిచ్చున్
తే.గీ
యోగ జీవితమును మార్చి రాగమువలె
కాయమంత తేలిక జేయఁ మాయమగును
జబ్బులు మరి యస్వస్థత; నిబ్బరముగ
జేయ నెపుడు సంపదగును జీవ సరళి
సత్యముగన మాన వెపుడు సాధనంబు

కామెంట్‌లు