1.మూడుసంధ్యలలోననువీడకుండ
నీదుమంత్రజపమ్మునునిష్ఠగాను
చేయుచుండిననిత్యము శ్రేయమవగ
విమలతేజమునొసగుమువేదమాత
2
నీదుమించినమంత్రములేదుననుచు
శృతులలోననుమిన్నయైసృష్టిలోన
మంత్రరాజమైవెలుగుచుమహిమగలిగి
విమలతేజమునొసగుమువేదమాత
3
నామజపమదిగాయత్రినవనిలోన
చక్కగాననుష్ఠించినసమముయగును
నాల్గువేదాలపారాయణమ్ముతోడ
విమలతేజమునొసగుచువేదమాత
4
బుద్దివికసించిమంత్రపుసిద్ధిచేత
వేదవిద్యలునబ్బునువిశ్వమందు
విప్రజాతికినినిదియెవిహితమవగ
విమలతేజమునొసగుచువేదమాత
5
జపముజేసిడిభక్తులజవమునిచ్చి
రక్షనుండుచుసతతమువీక్షజేస్తు
విమలతేజమునొసగుచువేదమాత
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి