పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత; -డా. భరద్వాజరావినూతల 9866203795
 🌳 సాహితీబృందావనవేదిక 🌳
ప్రక్రియ-సున్నితం
రూపకర్త -నెల్లుట్ల సునీత 
********
4️⃣3️⃣6️⃣)
ప్రకృతి మనకొక వరం
కాపాడుకుందాం దానిని నిరంతరం
పచ్చలహారం పుడమికి అది
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********
4️⃣3️⃣7️⃣)
కాలుష్యం మనకు ప్రాణాంతకం
విరివిగా‌చెట్లను నాటుదాం
 మనల్ని కాపాడే హరులు
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********
4️⃣3️⃣8️⃣)
అడుగుఅడుగుకలపండి
కాలుష్య భూతాన్ని తరిమి‌కొట్టండి
ప్రకృతి మాతను రక్షించండి
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********
4️⃣3️⃣9️⃣  
 పెరుగుతున్న ప్లాస్టిక్ భూతం
విషమయం చేస్తున్న రసాయనం
వదల్లేదు నీటిని సైతం
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********
4️⃣4️⃣0️⃣)
ఇంటింటా‌ నాటండి ఓమొక్క
పర్యావరణం రక్షిస్తుంది ఓపక్క
భావితరాల ఆస్తదే ఎంచక్కా.
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********  

కామెంట్‌లు