సర్వ శుభంకరుడు.. సాంబ శివుడు "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: 99127 67098
 🙏శ్రీ శివా మనోహర!
 
      హర! సర్వ శుభంకర!
      శుభముల నొసగుము శివ!
              ఓ సాంబ దేవ!
        ( సాంబదేవ పదాలు., శంకర ప్రియ.,)
👌సాంబ శివుడు.. సమస్తమైన శుభములను కలిగించు వాడు!
"శివం కరోతీతి శివః" అని, ఆర్యోక్తి! 
      "శివం కళ్యాణం తద్యోగాద్వా శివః!" యనెడు, వేదోక్తి ప్రకారం.. కళ్యాణ గుణములతో కూడి యుండువాడు.. సాంబశివ పరమాత్మ! 
👌శివా మనోహరుడు, శివుడు .. జ్ఞానము, విజ్ఞానము, విజయము, కళ్యాణము, మంగళము.. మున్నగు వాటిని; ఆరాధకులకు అనుగ్రహించు చున్నాడు! ఆది దేవుడు, మహా దేవుడైన పరమ శివుడు! 
⚜️కంద పద్యము⚜️
      శ్రీ హర! శుభంకర!  జగముల
      కే హానియు కలుగకుండ నిమ్ముగ శుభముల్
      సౌహార్ద్రమ్ముగ నిడెదవు,
      నీహృది నను నిలిపి, కనుము నీలగళ! శివా!!
( రచన: "అవధాని" డా. శాస్త్రుల రఘుపతి., శ్రీశివ శతకం, మంగళాచరణ పద్యము.,)

కామెంట్‌లు