👌విందుభోజన మందు
వంటకములే ముందు
జిహ్మ రుచికి పసందు!
ఆత్మ బంధువు లార!
(ఆత్మబంధు పదాలు., శంకర ప్రియ.,)
👌అరటియాకులు, లేదా విస్తరాకులపై.. పంచ భక్ష్యములైన ఆహార పదార్ధములు వడ్డించినదే.. "విందు భోజనం"! అందులో.. బూరెలు (పూర్ణములు), పులిహోర (హరిద్రాన్నము), మున్నగు పిండివంటలను; అప్పడాలు, వడియాలు, సాంబారు, గడ్డపెరుగు.. మున్నగు వాటిని వడ్డిస్తారు!
👌విందు ఏర్పాట్లు కనువిందును కలిగిస్తాయి! ఆ విందు భోజనము.. జిహ్మకు పసందుగా నుంటాయి!
"వివాహ భోజనంబు, విoతైన వంటకంబు,
వియ్యాల వారియందు, అహహ! నాకె ముందు!" అని;
"ఘటోత్కచుడు", చలనచిత్రము లోని పాట! బహుళ జనాదరణ పొందింది!
⚜️ఉత్పల మాల⚜️
మల్లెలవంటి యన్నమును, మామిడిముక్కల ఆవకాయయున్
పుల్లని పప్పుచారు, ఘన మోదక శాకము లాకుకూరలున్;
తెల్లని చిక్కనౌ పెరుగు దివ్యరుచుల్ కలియున్, రసమ్ము రా
జిల్లెడు, కమ్మనౌ ఘృతము చేరిన విందు పసందు నొందెడిన్!
⚜️తేట గీతి⚜️
అప్పడంబులు వడియంబు, లలరుచుండ
బూంది లడ్డూలు, బజ్జీలు బూరెలుండ
దప్పళంబులు
పులిహోర, దనరి యుండ
భోజనంబున కగును నీరాజనంబు !
( భోజన సంహిత., డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ ., )

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి