🙏"వాక్కు" రూపుడ వీవె!
"అర్ధ" రూపుడ వీవె!
పార్వతీ పరమేశ్వర!
శ్రీ సాంబ! సదాశివ!
( సాంబశివ పదాలు., శంకర ప్రియ., )
👌శ్రీశివ పార్వతులే.. మనకు ఆది దంపతులు! ఈ చరాచర ప్రపంచముయొక్క సృష్టికి, పోషణకు, సంహారములకు; మూలకారకులు! కనుక, ఈ జగతికి "తల్లి దండ్రులు"! అందుకే, శ్రీ ఉమా మహేశ్వరులకు.. రెండుచేతులను జోడించి, నమస్కరించు చున్నాము, మనమంతా!
👌 మహాకవి, కాళిదాసు.. "రఘు వంశము", మహా కావ్యము నందు; వాక్కు, అర్ధముల శక్తిని అనుగ్రహించమని; సాంబశివుని ప్రార్ధనా శ్లోకముతో.. "మంగళాచరణము" కావించారు.
"వాగర్ధావివ సంపృక్తౌ
వాగర్ధ ప్రతిపత్తయే!
జగతః పితరౌ వందే
పార్వతీ పరమేశ్వరౌ!!"...
అని, "శబ్దార్థ స్వరూపులు"గా; శ్రీ శివాశివులను ప్రస్తుతించారు! వారిరువురు.. "శబ్దములు, భావములు" రెండూ.. విడదీయరాని సంబంధము కలిగి యున్నట్లుగా; "ఏక స్వరూపులు"గా, దర్శించారు! ఆ విధముగా.. శ్రీపార్వతీ పరమేశ్వరులను, భక్తి ప్రపత్తులతో ప్రార్ధన కావించారు! కవికుల గురువైన కాళిదాసు!
⚜️తేటగీతి పద్యము⚜️
🙏పార్వతీ దేవియే వాక్కు, పరమ శివుడు
అర్థ రూపమ్ము నగుచును, అలరు చుండ;
ఆది దంపతు లనుచును నాదు మదిని
భావనమ్మును జేసెద, భక్తి మీర!
( కోడూరి శేషఫణి శర్మ., )

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి