జై కిసాన్;;- ప్రభాకర్ రావు గుండవరంఫోన్ నం.9949267638
హలం పట్టి పొలం దున్నే రైతన్నా
ఈ దేశానికి అన్నపూర్ణ నీవన్నా
నిను మించిన వారెవ్వరు లోకంలో
నీకన్నా మహాత్ములు మరెవరన్న

నాగలి పట్టి పొలం దున్నీ
మళ్ళు గట్టి నీళ్లు పోసి 
చెమటోడ్చి శ్రమ జేసి
పంటలు పండిస్తావు

రేయనక పగలనక
కాయాకష్టం జేసి
మట్టి తోనే జట్టు గట్టి
ధాన్యం పండిస్తావు
ఎవరొచ్చిన లేదనక
దానాలు చేస్తావు

ఈ దేశానికి వెన్నెముకవు నీవన్నా
అందరికీ ఆప్తుడవు నీవేనన్నా
జై   జయహో రైతన్న
ఈ జగానికి జై కిసాన్ నీవన్నా
🌹🌹🌹

కామెంట్‌లు