నీవు సుఖభోగివి కావాలంటే
నిజయోగివి కావాలోయ్ !
యోగం లోనే ఆరోగ్యం...
యోగంలోనే ఆనందం !!
యోగం సన్యాసులకే కాదు...
సంసారులునూ అభ్యసించి
తరించుమార్గమ్మిది !
యోగమున్నదివివిధవిధమ్ముల
అందులో అతి ముఖ్యమైనవి
కర్మయోగము, జ్ఞానయోగము
సంసార రాజయోగములు ప్రధా నమ్ములు...!
సంసార రాజయోగమే సమాజ
మునకు సర్వోత్తమము !
స్త్రీలు,పురుషులు,పిల్లలు,పెద్ద
లుఎవరైనా, ఇదిచేయవచ్చును
పద్మాసనమున స్థిరచిత్తముతో
భ్రూమధ్యమ్మున దృష్టిని నిలిపి
శ్వాస పైననే ధ్యాసను ఉంచి...
నాసికద్వారా క్రమపద్ధతిలో ప్రాణవాయువును లోనికి పీల్చి
ప్రాణ, వ్యాన, ఉదాన, సమాన
అపానాదులౌ...పంచ ప్రాణము ల ఏకముజేసి, మూలాధార స్థా నములోన ముడుచుకుని యు న్న కుండలిని ని, మేలుకొలిపి...
స్వాధిష్టాన, మణిపూరక,అనా హత,విశుద్ధ లనుదాటించి,భ్రూ మధ్యమునత్రికూటమ్ములో.... కొలువైయున్న....ఆఙ్ఞాచక్రమునకు జేర్చి ఆ యాజ్ఞాచక్రముఛే దింప జేసి ప్రాణశక్తి యప్.కుం డ లిని సహస్రారమున ఐక్య ముజేసి కఠోర దీక్షతో కాపాల మ్మును భేదించి... మోక్షము బొందగ ప్రయత్నింతురు క్రియా యోగులు !
పూరక, కుంభక, రేచక క్రియ లతో... ఈ మోక్షమునకే బ్రయ త్నింతురు, హఠ యోగులు !
సంసారులసహజయోగమున
ఇట్టి పాట్లేవీ పడకుండగానే... పరిపూర్ణ ఆయురారోగ్యముల తో సుఖ, సంతోషములఆనంద ముగా బ్రతుక వచ్చును !
సుఖాసనమ్మునస్థిరముగకూచు ని..క్రమపద్ధతిలో శ్వాస క్రియ జరుపుతూఆశ్వాసపైననేధ్యాస ను ఉంచుతూ...ప్రతిరోజూ సమయ పాలనతో అభ్యసిం చిన ఊహించలేని ప్రయోజ నమ్మే ఒనగూరు.... !
మేల్కొనండి మిత్రులారా.....
యోగాభ్యాసము గావించండి !
ఎనలేనిసౌఖ్యమునుబొందండి.
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి