అమ్మ- నాన్న;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 మన ఈ చిన్ని జీవితంలో,
మనకు మంచి మాటలు చెప్పినవారో...
మన కోసం ఆలోచించేవారో...
మనకు మనపై నమ్మకాన్ని పెంచినవారో...
మనం సాధించగలమని నమ్మినవారో...
మన ప్రయత్నాన్ని ప్రోత్సహించినవారో...
మన తప్పటడుగులను సరిచేసినవారో...
మనకు కష్టకాలంలో సాయంగా నిలిచినవారో...
మనకు కలత కలుగగ కన్నీటిని తుడిచినవారో...
ఎవరో ఒకరు ఏదో ఒక స్థితిలో
ఏదో ఒక ఎమోషన్ లో మనకు కనెక్ట్ అవుతూ
మనను వాళ్ళ మాటల ద్వారా, 
చేతల ద్వారా ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు...
కానీ ప్రతి ఒక్కరికి, మనం పుట్టినప్పటి 
నుంచి మనను మాత్రమే ప్రేమించేవారు...
వాళ్ళు చనిపోయే వరకు మనమే ప్రాణంగా బ్రతికేవారు
ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు వాళ్ళే అమ్మ- నాన్న


కామెంట్‌లు