శ్రీ శ్రీ కళా వేదిక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ నూతన కార్య వర్గం


  శ్రీ శ్రీ కళా వేదిక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ నూతన కార్య వర్గం శనివారం ఏర్పాటైంది .  ఇది  ఐ ఎస్ ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక  కళా సామాజిక సేవాసంస్థ.దీని ఛైర్మెన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ ,జాతీయ కన్వీనర్ శ్రీమతి కొల్లి రమావతి,జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఈశ్వరీ భూషణం,రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గుత్తా సర్వోత్తమ నాయుడు పర్యవేక్షణలో  నూతన కార్య వర్గం ఏర్పాటు జరిగింది.జిల్లా అధ్యక్షులుగా గుండాల నరేంద్ర బాబు, ఉపాధ్యక్షులుగా డాక్టర్ ఆరుమూళ్ళ మాల్యాద్రి, ప్రధాన కార్యదర్శి గా దువ్వూరు సుమలత,మహిళా కార్య దర్శులుగా ఐలా వజ్జుల అనురాధా  రామకృష్ణ, కామంచి శారద,కార్య నిర్వాహక కార్య దర్శిగా చవలం బాలకృష్ణ, సహాయ కార్యదర్శిగా సోమా పద్మా రత్నం  లను ఎంపిక చేసినట్లు  సంస్థ చైర్మన్ డా.కత్తిమండ ప్రతాప్  ఉత్తర్వులు జారీ చేశారు.నూతన కార్య వర్గానికి పలువురు సాహితీవేత్తలు, నగర ప్రముఖులు,కవులు ,రచయితలు  అభినందనలు తెలియజేశారు.


కామెంట్‌లు