సరాగం;-సి.హేమలత(లతా శ్రీ)పుంగనూరు
కవిత నా పాటలు విని భరించే 
స్వర మిత్రులకు అంకితం ఇస్తున్నాను

పాపబోసినవ్వోరాగం
బుజ్జాయి పాలకోసం ఏడుపు మరో రాగం..
.భయంతో ఏడుపు షడ్జమ రాగం..
తండ్రిని గుర్తించినప్పుడు 
విరిసిన మందారంలా నవ్వు మరో రాగం...
ఇలా ఆస్వాదించే అమ్మకు అపురూపం ఈ సంగీతం

గలగల పారే యేరు పాడు ఆనందభైరవి రాగం
దానికనుగుణంగా...యేటినడక సోయగం 
వేయు తాళం...చిగురుటాకు అలల్లాడుతూ
పాడు పల్లవి...ఎంత గొప్ప ప్రకృతి

ఆయుర్వేద ఔషదం సంగీతం
శిలనైన కరిగించును..శిలలాంటి 
మనసును మురిపించును



కళామతల్లి ముద్దుబిడ్డ లకు చేయూత
అలసిన వేళ నా సేద తీర్చు
అనురాగ వళ్ళీ ఈ సంగీతం
కాలంతో నడుస్తూ  ఆపద 
ఎదుర్కోనలేని నిస్సాహాయస్థితిలో
 ఆత్మస్థైర్యం మనలో నింపి 
నూతనోత్తేజం తో..ముందుకు
 సాగడానికి ప్రేరణ సంగీతం...
సప్తస్వరాల సంగీతం మన
 జీవితంలో పరచు సప్త సింగిడీలు


కామెంట్‌లు