సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 కోల్పోయేవి...మిగుల్చుకునేవి
*******
ఈ సృష్టిలో ప్రతి జీవి కోల్పోయేవి జవసత్వాలు. వాటి నుండి ఎవరమూ తప్పించుకోలేం.
కానీ జీవితంలో చేజేతులా  కోల్పోయేవి కొన్ని  ఉంటాయి. అవే నీతీ, నిజాయితీ, మంచితనం, మానవీయ విలువలు.
కొందరు అన్యాయం, అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ,అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తారు.
అలాంటి వారు ఆర్థికంగా ఎంతైనా ఎదగవచ్చు కానీ..సాటి వ్యక్తుల్లోనూ, సమాజంలో దుర్జనులుగానే గుర్తింపబడతారు.
తల మీద మాణిక్యం  ఉన్న పామును చూసి భయపడతారే తప్ప, ఎవరూ గౌరవించరు కదా... 
విలువలు కోల్పోయిన వ్యక్తులు కూడా అంతే....
జీవితంలో మిగుల్చుకునేవి రెండే రెండు. ఒకటి మంచితనం ,రెండవది ఈ సమాజం గుండెల్లో చెరగని స్థానం.
మనం మరణించినా  ఈ నేలపై మనకంటూ మిగుల్చుకునేవి ఇవే.
 కోల్పోవడమా..మిగుల్చుకోవడమా అనేది మనిషి నైతికత మీద ఆధారపడి ఉంటుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు