*రుబాయీలు ;-:ఎం. వి. ఉమాదేవి
 ఇతిహాసం పాత్రలాగ ఒదిగినాడు మా నాన్నా 
సత్యధర్మ ఛాయలలో ఎదిగినాడు మా నాన్నా 
నమ్మినట్టి భావాలకు నమ్మక ద్రోహం ఎదురై 
కాలమిచ్చె తీర్పుచూసి ఒరిగినాడు మా నాన్నా !!

సొంత శైలి ఒకటిఉండి తీరాలీ కవిగారూ 
అనుకరణకి అడ్డుకట్ట వేయాలీ కవిగారూ 
భావదరిద్రం వలలో చిక్కుకున్న చేపవైతె 
ఇంటబైట ప్రశ్నలెదురు కోవాలీ కవిగారూ !
$$$$$$$$$$$$$$$$$$$$

కామెంట్‌లు