ఆలోచించే భాషే మన భాష!! !- ప్రతాప్ కౌటిళ్యా
 సాధారణంగా మనం ఏ సమాచారాన్నైనా విన్నా, చదివిన, చూసిన బాగా అర్థమవుతుంది. గుర్తుంటుంది. కొంతకాలం తర్వాత అది పాత పడిపోతుంది. మర్చిపోతాం. అది జ్ఞాపకశక్తికి సంబంధించిన అంశం కానీ మనం ఏదైనా సమాచారాన్ని అర్థం చేసుకోవాలంటే, గుర్తు ఉండాలి అంటే, సమాచారం నేరుగా మన భాష లోనే ఉండాల్సి వస్తుంది. ఉదాహరణకు మన మాతృభాష ఇంగ్లీష్ అనుకోండి, ఇంగ్లీషులో ఉన్న సమాచారం నేరుగా మనం అర్థం చేసుకుంటాం. గుర్తుంచుకుంటాం. అంతేగాని ఒకవేళ మన మాతృభాష ఇంగ్లీష్ కాదనుకోండి అప్పుడు సరిగ్గా ఇంగ్లీషులో ఉన్న సమాచారం నేరుగా మనం అర్థం చేసుకోలేం గుర్తుంచుకోవాలేం.
ఒకవేళ అర్థమైనా, అది మనకు గుర్తుండదు
అంటే సమాచారం అంతా శూన్యం అయిపోతుంది. ఒక అయోమయ పరిస్థితి నెలకొంటుంది. అంటే మనం విన్నది చూసింది చదివింది అంత మర్చిపోతాం
ఈ ప్రక్రియలేవి మనకు సమాచారాన్ని ఇచ్చిన సందర్భము బ్లాంక్ గా ఉంటుంది.
ఇది నిరంతర ప్రక్రియ నిజానికి మెదడు తాజాగా ఉన్న సమాచారాన్ని అర్థం చేసుకుని గుర్తుంచుకుంటుంది. తాత్కాలికంగా కొంత కాలం తర్వాత మర్చిపోతాం. కానీ పరభాషలో ని సమాచారం ఎంతో తాజాగా ఉన్న ప్రస్తుతానికి కూడా అర్థం చేసుకోలేం. ఒకవేళ అర్థమైన గుర్తుండదు. అంతా మర్చిపోతాం. అది ఒక సంఘటన కూడా మన మనసులో ఉండదు అంటే అంతా బ్లాంక్ గా మారిపోతుంది అన్నమాట. సమాచారాన్ని మోసుకెళ్లే భాష మన భాషై ఉండాల్సిందేనీ అర్థమవుతుంది.

ఇది ఒక బాల్యంలోనే పరిస్థితి మాత్రమే కాదు. ఏ దశలోనైనా అందరూ అనుభవించే తెలుసుకున్న విషయమేనని మనకు అర్థమవుతుంది. సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనకు అందించేది భాష . కానీ అది నేరుగా సమాచారాన్ని మనకు కమ్యూనికేట్ చేయాలంటే అది మన భాషై ఉండాలి. అప్పుడే అందులోని అనుభూతిని అనుభవాన్ని పొంది అర్థం చేసుకొని గుర్తుంచుకుంటాం.
నిజానికి మనం ఏ సమాచారాన్నైనా విని చూసి చదివి అర్థం చేసుకొని గుర్తుంచుకుంటాం. అది ఆసక్తికరమైనది కాకపోయినా సరే. పరభాషలో అయితే తాత్కాలికంగా కూడా అనుభూతి చెందడం అర్థం చేసుకోలేం గుర్తుంచుకోలేం. అంత బలమైన భాషా బలహీనతగా మనం గుర్తించాలి.
ఏదైనా సమాచారాన్ని అర్థం చేసుకుని గుర్తుంచుకోవాలంటే, ముందు భాష ముఖ్యం. అది మాత్రమే మనకు పూర్తి సమాచారాన్ని కమ్యూనికేట్ చేస్తుంది. కనుక మనకు నేరుగా కమ్యూనికేట్ కావాలంటే తప్పనిసరిగా మన మెదడు దానికి అలవాటు పడి ఉండాలి. అప్పుడే ఆ సమాచారం అంతా కమ్యూనికేట్ అవుతుంది. అంటే మనం ఏ భాషలో ఆలోచిస్తామో, ఆ భాషలోనే సమాచారాన్ని కమ్యూనికేట్ చేయగలుగుతాం తప్ప,
వేరే భాషలో సంపూర్ణంగా కమ్యూనికేట్ చేయలేం. మన మెదడు అలవాటుపడ్డ సాంకేతిక భాష ల వలన అర్థం చేసుకుంటుంది. గుర్తుంచుకుంటుంది. సంపూర్ణంగా సాంకేతిక భాషను మనకు సమాచారాన్ని కమ్యూనికేట్ చేయలేదు. అంటే మనం మధ్యలో అలవాటుపడ్డ భాషలో మనం సంపూర్ణంగా సమాచారాన్ని అర్థం చేసుకోలేం. గుర్తుంచుకోవాలేం. మన ఆలోచనలు ఏ భాషలో వస్తాయో ఆ భాషలోనే అలవాటు పడటం తప్ప వేరే భాషలో సంపూర్ణ సమాచారాన్ని కమ్యూనికేట్ చేయలేము. అంతేకాదు అనుభూతి చెందలేం. అర్థం చేసుకోలేం గుర్తుంచుకోలేం.
మనం ఆలోచించే అలవాటు పడ్డ భాషలోనే మనం ఏ సమాచారాన్నైనా సంపూర్ణంగా కమ్యూనికేట్ అవుతాం. వేరే భాషలో కాలేం‌. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం ఆలోచించే భాషలోకి మెదడు వేరే భాష అనువాదం చేసుకుంటుంది. అలాగే సమాచారాన్ని మనం ఆలోచించే భాష నుంచి వేరే భాషలోకి అనువదిస్తున్నాం. అంటే మన మెదడు ఆలోచించే భాషలోని ఆలోచనలను సమాచారాన్ని వేరే భాష లోకి మార్చు కునేందుకు ప్రయత్నిస్తుంది. అలవాటు పడుతుంది. ఒక రకంగా మనం మన ఆలోచనలను సాంకేతిక భాష ద్వారా వేరే భాష ను అర్థం చేసుకుని గుర్తుంచుకుంటాం.
కనుక పుట్టిన ప్రతివాడు కేవలం ఏదో ఒక భాషను ఎంచుకుని ఆ భాషనే తన మాతృ భాష గా మార్చుకుంటే మంచిది.
మన మెదడు ఏ భాషలో ఆలోచిస్తామోఆ భాషలోకి సమాచారాన్ని అనువాదం ఆటోమేటిక్ గా చేస్తుంది. అట్లే ఆలోచించే వేరే భాష లోకి సమాచారాన్ని అనువదించేందుకు మెదడు అలవాటు పడుతుంది. సాంకేతికంగా మెదడు మనకు తోడ్పడుతుంది. ఎన్ని భాషలు అయినా ఈ పద్ధతిలో నేర్చుకునేందుకు మెదడు సహకరిస్తుంది. మనం ఏ భాషలో ఆలోచిస్తామో అదే మన భాష అవుతుంది.
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు