]భక్త కన్నప్ప (ఇష్టపదులు );-ఎం. వి. ఉమాదేవి
 కోయవానిగ బుట్టి కోనలను దిరుగుచూ 
తిన్నడను పేరుతో తీరుగా వేటలను 
పక్షులను మృగములను పట్టి తినుచును యుండ
శిథిలాలయమునందు శివ లింగమును జూచి 
చిరుభక్తి కలుగంగ చేయుచును పూజలను 
మోటుగా మాంసమిడి  మోదమందుచు నుండె 
గిరిపుత్ర భక్తినిక గిరిజపతి పరీక్షలు 
చేయగా నిశ్చయము చేసి కన్నీరొలికె !
తిన్నడది చూడగా తికమకలు పడుచుండె 
ఆకుపసర్లు వేయ  ఆదిదేవుని కన్ను 
నయముగా లేదుమరి నయనాలు వర్షించ
రుధిరమ్ము కారగా రోదనము తో తిన్న 
సామి యిదేమి వింత సర్దుకుని పోవయ్య
నేనేమి జేయవలె నేత్రమే బెట్టెదను 
అనుచు ముగ్ద భక్తుడు నతనికన్నును పెరికి 
హరుని కమర్చగాను హరించ రుధిరమ్ము 
3)
మలికంట పడసాగ మందుoది కదయనుచు 
నానవాలుగ కాలు నాహరుని కంటనిడి 
కన్నునే తొలగించి కాళిపతికిని బెట్ట 
మూఢభక్తికి మురిసి మోక్షమిచ్చెను స్వామి 
తన పరిధిలో నెవడు తపనగా పూజించు 
నట్టి భక్తులకోవ నతడు కన్నప్ప య్యె 
గొడగూచి యక్కమ్మ గురుతుగా నిలిచిరిల
శ్రీ కాళ హస్తియును శ్రీకంఠ మహిమలివి !!

కామెంట్‌లు